పుట:నీతి రత్నాకరము.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి వీచిక

17

నియత కాలమున కాసభాధిపతి లేచి యానాఁటిసభా సమావేశ హేతువును వివరించి రాధికకుం గల సంగీత కౌశలమును బరీక్షీంచుసమయ మిదియే యనియు, నోపికమైఁ జూడవలయు ననియుఁ, గోలాహల మొనర్ప ని ది సమయము కాదనియు విన్నవించెను. ఆయుత్తరక్షణమున నిస్తరంగమహా సాగరము భంగి నాసభాభవన మెల్ల నిశ్శబ్దమయ్యెను. పరీక్షకు లంతకుముందే నిర్ణయింపఁబడియున్నను దత్కాలమున వారి పేరులు సభాధిపతి చెప్పుటయు నెల్లరు నామోదించుటయు జరగవలసిన యాచార మగుట నట్లే యొనర్పఁబడియెను, వారు మూవురు లేచి యాచోటున నమరుపఁబడిన యుత్తుంగాసనముల పయిం గూరుచుండిరి. రాధికయు వారి చెంతనున్న యా స్తరణమున నుపవిష్టురా లయ్యెను. ఎల్లర కామె కనఁ బడుచుండవలయు నని యట్లోనర్పఁబడియె నఁట. పరీక్షకులు మూవురును వ్యాళ గ్రాహిని జేరిరి. ఆతఁడును రాధిక సమీప మునఁ గూరుచుండెను. ఏటికో యని యెల్లరు సంశయసమా క్రాంతస్వాంతులే యైరి. కాని 'యిదమిత్థ' మ్మని యొక్కరును నిర్ణయింపఁజాల కుండిరి.

పరీక్షకులలో నొక్కఁడు శివశంకరశాస్త్రి, మఱొక్కఁడు రామచంద్ర రాజు, మూఁడవవాడు సుదర్శన ప్రసాద పాండ్య, అని యెల్ల రెఱుంగవలయును. శివశంకరశాస్త్రి రాధికం గాంచి “ఆమ్మాయీ! శంకరాభరణ రాగము విపంచికయందు మేళవించి పాడుమా" యని యను రాగ మతి శయిల్లఁ బలికెను. 'రాధికను విపంచికస వ్యాంక సీమఁ గుదురు పఱచి తంత్రులమీటెను. ఆస్వరము సర్వజనశ్రుతిపుటపేయ