పుట:నీతి రత్నాకరము.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

నీతిరత్నాకరము


మయ్యెను. రామచంద్రరాజు "కుమారీ! నీయెదుటనున్న వాఁడహితుండికుడు సుమీ! వాని చెంతనున్న పేటిక యందు నవీన కాల భుజంగ రాజమున్న ది. శంకరాభరణ మాలాపించి పాడు నపుడది మనకు వశ్యమయి యెవరు చెంతకువచ్చినను గ్రోధ మూనక నీపాటనే నే యాలకింపవలయు. అది పరీక్ష కావునఁ జక్కఁగా నీభావమును మదినిలిపి శాస్త్రము మీఱక పాడవలయును." అన, సుదర్శన ప్రసాదపాండ్య మాత్ర మిది విషమపరీక్షయే యని యూర కుంకెను.

శ్రుతి సాయపడగా నారాధిక పాడనారంభించెను. వాద్యగళస్వనము లేకమై వీనుల విందుగ నెసంగెను. ఒక్కరైనను మాటలాడఁజాల కూరకుండిరి. ఇన్ని చిత్ర ప్రతిమ లోక్కచో నెట్లు చేరినవి? అను ననుమానము నది పుట్టించెను. శివశంకరశాస్త్రి, వ్యాళగ్రాహిని గాంచి జాగ్రత్తపడు మనియె. ఆతఁ డించుక పేటికం గదలించెను. భయంకరముగ బుస్సను ధ్వని యెల్లరఁ దల్లడిల్లఁజేసెను. ఇదే యేటిపరీక్ష ! అని యంద ఱనసాగిరి. శాస్త్రి లేచి యార్యులారా! మీరూరకుండుఁడు రాధిక మాకుఁ బ్రియపుత్త్రికవంటిది. ఏమి కీడు రాఁబోదు. ఎవ్వరి కేమి కీడును గలుగదని నమ్ముఁడు. త్వరపడక యించుక యోపికం దెచ్చుకొని పరికింపుఁ డనియె. ఆమాటల కెల్లరు లోఁబడి యూరకుండిరి, రాధిక రాగ మూలాపించెను. కొలఁది నిమేషముల కాభుజంగశబ్దము సన్నగిల్లెను. మఱి కొలది క్షణముల కాపెట్టె మూఁతతీయ ననుజ్ఞ కాఁగా నాతఁ డట్టు లొనరించెను. ఫణియు విస్తృతపణము వెలయించి లేచెను. నేత్రము అగ్నిగోళముల నధఃకరించుచుండెను. మనోధైర్యము