పుట:నీతి రత్నాకరము.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16 నీతిరత్నాకరము

చిత్రించుచు వానిం బరీక్షించుచు దానియంద మిట్లుండినఁ గాని, ఫలింప దని యూహించుచుండెను.

సంగీత మామె పాడఁగా విన్న వారెల్ల నొక్కదినము చక్క నాలోచించి సభచేసి యామె 'కాశీః పురస్సరముగా నొకపదక మీయ నిశ్చయించిరి. ఆయుదంతము తల్లి దండ్రులకు ముందుగాఁ దెలిపి వారి యనుమతినొంది. పెద్దల 'కెల్ల రకుం దెలిపిరి. ఆనాఁ డొకచోటఁ బేరోలగము గూడెను. సంగీత శాస్త్ర పారంగతులే యందుఁ బెక్కం డ్రుండిరి. తల్లిదండ్రు, లా రాధికను ఘోటకశకటమునఁ గొనివచ్చి యర్హస్థానమునఁ గూరుచుండఁ జేసిరి. పురపురంద్రులెల్ల నొకచోఁ గూరుచుండి వేడుక చూచుచుండిరి. వారి కించుక దూరమునఁ బురుషులు కూరుచుండ వారియంతికమున నొకవ్యాళ గ్రాహి యుండెను. వాఁ డేల యీ విద్వత్సభలో నున్న వాఁ డని కొందఱు సంశ యించుచుండిరి. కొందఱు వాడు సంగీతమున నిధి యనిరి. కొందఱు చూడవచ్చె ననిరి. మఱియుఁ గొందఱు వాఁ డేదో పనియుండి వచ్చియుండుననిరి. ఇంకను గొందఱు మహాసభకు ధనవంతు లెందఱో యరు దెంతురు గాన వారిని యాచింప వచ్చె ననిరి. ఇఁకఁ గొందఱు వాఁడుకూడఁ బరీక్ష కుఁడే యనిరి. మణికొందఱు దృష్టిదోషము తగులకయుండ రక్షఁగట్టఁ బిలి పించియుందు రని యూహించిరి. ఒక్కఁడు మాత్రము కాదు కాదు. మీయూహలు పరిహాసమునకుఁ దగినవి. ఆకన్యకను భయపెట్టి యామెకు శక్తి యెంత గలదో కసఁబఱపవలయు నని వచ్చె నని చెప్పెను. ఇట్లు నానాముఖముల వారియూహాలు ప్రాఁకుచుండెను.