పుట:నీతి రత్నాకరము.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి వీచిక. 15

నమే యనఁదగును గాని, వేఱోకనాదము దానిం గలిసియున్న దన వలనుపడక యుండెను. సంగీతముతోడఁ జిత్ర లేఖన మారంభింపఁబడియెను. చిత్ర లేఖనమున మానవులపరీక్ష, యంత మంచిది కాదని బుద్ధిమంతు లూహింతురు. పశుపక్ష్యాదులు దానింగాంచి యాసక్తములై చెంతకుంబోవ నదియే దానికౌశల మని పెద్దలందురు.

ఒక్కనాఁ డాదంపతులు వేడుక కై ద్రాక్షాఫలముల నిర్మింపుమని రాధికకుం దెలిపిరి, అట్లే యొనరింతు నని వర్ణకములఁగలిపి యామె యాఫలముల నలవరించెను. వాని నాదంపతులు చూడక రాధికా! అవి బాగుండు నని యెట్లు కనుఁ గొనవచ్చు నని ప్రశ్నించిరి. పందిరికి వ్రేలాడఁగట్టిన 'వానియం దము ప్రకటమగు నని యామే పలికెను. గృహమునకు దూర ముగనుండు నొకపందిరికి వాని వ్రేలాడఁగట్టిరి. దూరమున నుండి పరీక్షించుచుండిరి. కొలఁది నిమేషములకుఁ బక్షులు వచ్చి వానిం బొడువ నారంభించెను. చిలుకలు తటాలున నా చెంత వ్రాలెను. పటపటమని పొడువసాగెను. పరీక్షకులు చిత్రంపడిరి. తండ్రి, రాధికను జెంతకుఁ దీసికొని యుపలాలిం చెను. వేఱోకనాఁ డా రాధిక యొక చిలుకను బావురమును జేవ్రాసి వర్ణకముల వాని సింగారించెను. దూరముగ నిలిపెను. చిలుకలు మొత్తముగా వచ్చి దానిం బొడుచుచుఁ బోవసాగెను. ఎక్కడనుండీయో యొక శ్యేనము బుస్సున వచ్చి పావురమును దన్నెను. దానిం గాంచినవారెల్ల నిగి ప్రకృతి చిత్రకమే యని పలికిరి. ఇట్లే యామె పెక్కుతడవలు