పుట:నీతి రత్నాకరము.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీతిరత్నాకరము

వృత్తాంతమును దెలిపెను. ఇరువురు తలపోసికొని కుమారిక కలుగునని యూహించిరి.

మఱుదినము శుక్ర వారము. ఆనాడు రెండవజాము రాఁగానే ప్రసవచిహ్న ములు కనఁబడుటయు నాలస్యము లేక ప్రసవించుటయు శిశువు కన్యకయగుటయుఁ దెలియవచ్చెను. దాసు తమరూహించినట్లే సాగెనని యానందించెను. దైవజ్ఞులు గ్రహగతులఁ బరికించి బాలారిష్టాదిదోష లేశములు లేక దీర్ఘాయువుకలదని ప్రశంసించిరి. జాతక ర్మాదికృత్యములు యథా విధి నొనరింపఁ బడియెను. నామకరణ మహోత్సవకాలమున యథోచితసత్కారముల నెల్లరం దనిపి రాధిక యను పేరు ప్రక టించి దాసు కృతకృత్యుఁ డయ్యెను 'బాలయు దినదిన ప్రవర్ధ మానయై శశికలను దిరస్కరించుచుండెను. రాధిక పుట్టినది మొదలు దంపతులకు సంపల్లాభము మెండయ్యెను. దాన నాకన్య కారత్న మదృష్టవంతురాలని యెల్ల రనుకొను నట్లే వారు నూహింపసాగిరి. క్రమముగా నామెజీవితమున నెనిమిది 'యేండ్లు గడచెను. ఆవయస్సునకే విద్యావతియన్న పేరు వచ్చెను. ఒక్క పర్యాయము చెప్పిన పాఠము మరల మఱపు నకు రాకుండెను. విద్యాభ్యాసమున నాలుగువత్సరములు గడచెను. పదుమూఁడవయేఁడు రాఁగా సంగీతము చెప్ప నారంభించిరి. కంఠస్వర మనుపమానము. వర్ణనము 'లేల కాని కిన్నరీకంఠమును బోలియుండెననుట యధార్ధము. విపంచీ నినాదము నా మెకంఠము కలిసిపోవుచు వేఱుపఱుప నశక్య ముగ నుండెను. ముఖచిహ్న లేశములఁ బరికించి పాడుచున్న దనవలయునే కాని దూరమున నున్న యెడల వీణావాద