పుట:నారాయణీయము.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

iv


ధియాం ప్రచోదయిత్రీ యా సావిత్రీ రజసఃపరా
వరదా వ స్సదా పాయాత్ సచ్చిదానంద సంపదా॥

బహుముఖ గ్రంథరచనఁ గవితాసవ్యసాచి యనఁదగు కవిసమ్రాట్టు విశ్వనాథ సత్యనారాయణ ఎమ్. ఏ. గారిట్లు మమ్ము దీవించిరి .

అహరారంభములం దనౌపనిషదంబై పొల్చి యీకర్మయున్
దహరోపాసనయే, విరించితరుణీ తాత్పర్య చింతా ముహు
ర్ముహు రాసంచర దున్మనీచరమదిక్పుష్యద్రస స్రోతసీ
లహరీస్వాదుతరంగ మజ్జనమనోలావణ్య నిర్వాణమై.

మలయాపత్యకలందు మీనిలయ మీ మాత్రంబు సంధింప దే
యలఘుస్వాదువు నిర్వృతిన్ గృతిపతిత్వానందమున్ దీక్షితో
జ్జ్వల వాక్పేశలతా లతాసుమ లసద్ బాహాపరీరంభ మా
వల నారాయణ సత్కృపావిముల సంభారమ్ము రెట్టింపగన్ ,

ప్రత్యగాత్మ బహిర్ముఖత్వ ప్రధాన
అపర శివమూర్తి శారద విపులజఘన
ఆత్మ సముపసంహృతినిదానార్ద్ర రస జ
గ ద్విహారిణి మీయందుఁ గలుగుఁ గాక.

దివ్యవాణి సంపాదకులగు శ్రీ చివుకుల అప్పయ్యశా స్త్రివర్యు లిట్లనిరి :

చరితంబా యఘనాశనంబు, కవితా సాహిత్యయుక్తంబు వై
ఖరియా కమ్రము, పాకమా మధురసాక్రాంతంబు సారాంశమా
నర వాంఛాదము, రామకృష్ణ ధృతత న్నారాయణీయంబు క
ల్లురి సోదర సుధీకృతంబు విలసిల్లుం గాత మాచంద్రము౯.

శ్రీ కప్పగంతుల లక్ష్మమణశాస్త్రి మహోదయు లిట్లు దీవించిరి.

శ్రీ నారాయణభట్ట కేరళ కవిః సంఖ్యావతా మగ్రణిః
నిర్మాయామృత పేశలాం సుమహతీం నారాయణీయాం కృతిమ్
భక్త్యుత్తేజిత భావ బంధురమయీం కంఠే నిబధ్న౯ హరేః
గుర్వాయూరధివస్య ధన్యజనుషామగ్రేసరో౽భూ త్సదా.