పుట:నారాయణీయము.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

v


కల్లూర్యన్వయదుగ్ధ సింధుశశి సుబ్రహ్మణ్య కవ్యగ్రణిః
బ్రహ్మణ్య స్తదనన్యభావభరితః కావ్యం మహాంధ్ర్యాం ముదా
భక్త్యా నూద్యచ రామకృష్ణసుధియే ప్రీత్యార్పయత్; శ్రీహరిః
భర్తుః కర్తు రపి ప్రియం వితనుతా మాచంద్రతారార్యమమ్.

ఇట్లు మాయెడ చెలికారము పాటించిన ధర్మైకధిషణులై యిప్పుడిప్పుడు సుకవితా పల్లభులగుచున్న శ్రీ జటావల్లభుల పురుషో త్తము ఎం. ఏ. గారును నా గ్రంథము నామూలాగ్రము పఠించి సుహృదృన మధురమగు విమర్శము రచించియున్నారు. సమకాలిక విద్వత్సహకవి బృందమునకెల్ల వందనము లర్పించుచున్నాను.

ఇట్లే మమ్మభినందించిన;

అలౌకిక భాషారసజ్ఞ శేఖరులయి, లౌకిక పదవీ సమధిరూఢులయిన వారిలో ప్రకృత మాంధ్రదేశ లెజిస్లేటివ్ కౌన్సిల్ అధినేతలయి, కృతిస్వీకర్తకుం గూర్చు మిత్రులయి యాంధ్రోద్యమ జాంబవంతులగు "పద్మభూషణ" శ్రీ మాడపాటి హనుమంతరావు, శ్రీ పింగళి లక్ష్మీకాంతము ఎమ్. ఏ, వాణిజ్య సంఘాధి నేతలగు శ్రీ జె. వి. సోమయాజులు, పంచాగ్నుల సూర్యనారాయణ, సరసా వెంకటేశ్వరరావు, దేవాదాయ శాఖానియుక్తులగు శ్రీ జి. యస్. ఎన్. రామమూర్తి ప్రభృతులును మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తియై తత్కాల మద్రాసు గవర్నరు పదవీ సమధిష్ఠితులగు. శ్రీ పి. వి. రాజమన్నారు, ఆంధ్రప్రదేశ విద్యామంత్రివరులగు శ్రీ ఎస్. బి. సి. పట్టాభిరామారావు, బి. ఎ.. బి. ఎల్, దేవాదాయ కమీషనర్ పైడి లక్ష్మయ్య ప్రభృతులగు సారస్వత రసికావసంతులగు నశేష మిత్రశ్రేణికి నా ప్రత్యభి నందనములు.

రాష్ట్రాభిమానమున నాత్మీయుఁడగు నారాయణ నంబూద్రిపాదుని రచనకు వ్యా ప్తికోరి, యాంధ్రుల మైత్రికోరి యుభయరాష్ట్ర రాజకీయ సమరస సమభినివేశములచే నాకృతి నాదరించి బహుసహస్రార్థ సమర్థముగ నన్ను సత్కరించి తక్కిన రాష్ట్ర ప్రభుత్వములకు మార్గదర్శకమయిన కేరళరాష్ట్ర ప్రజాహిత మంత్రివర్గమునకును గురువాయూరు దేవస్వం కమిటీ అధ్యక్షులగు శ్రీ కాలికట్టు రాజాగారికిని నా కృతజ్ఞత దెలుపుచున్నాను.