పుట:నారాయణీయము.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42


హృదయంగమముగ పాడుటయందే విశేషము కలదు. ఆ విశేష మీ కృతిలో స్ఫుటమై, పాఠకులకు విందొనరించుచు, ఆంధ్రీకరణప్రయోజనపారమ్యమును నిస్సందేహముగ సాధించినది. కావుననే నారాయణీయ మాంధ్రలోకమునకు సమ్మాన్య మగుచున్నది!

అందు ఆశ్చర్య మేమియు లేదు ! కవియే చెప్పుకొన్నాడు కదా ! "మధురాంధ్ర వచఃశ్రుతిమేళవించి, నాణికరకంకణక్వణన నిస్స్రుతతాళలయానుకూల, తంత్రీకుల నిస్సరత్ స్వరధునీమయ తానవితాన మూర్ఛనా, ప్రాకట రాగ, భావమయ భక్తి విపంచి వహించి మీటితి" నని ! ఔనౌను ! "తత్త్వమాకందము దయారస మూలకందమైనది ! భావుకులు సుగ్రహమైన విగ్రహమునందే తన్మయులు ! సుధాంభస్సింధు పూరమ్ములు! చిద్రసార్ద్రమధురమ్ములు ! కందొవకు నందియు నందనివి ! “అందును భూమియందు జలమందున వెల్గున గాలి నాకసమ్మందు మహత్తునం బ్రకృతియం" దనుచో భాగవతసప్తమస్కంధము మనస్సును దాకుచున్నది ! జలదశ్యామ కలాయ కోమల కలాచక్రములను, తామరతంపరగాగ జీవదేహములను, నాసీమాంతవిశ్వమ్మును, చూచుచున్నాము. “అభంగభంగఝషనక్ర క్రాంతి భ్రామ్యత్తిమింగిలకల్లోలితమైన జలముల"లో నిల్చి వరాహమూర్తి "వందిబృందముల కచ్చపు వెన్నెల లారబోసినాఁడు !" “అత్యుచ్చైః పాతితముష్టి ఘాతములు." కర్ణతాడితములగుచునే యున్నవి. కూటకిటి "దేవవిద్విషత్కీటము గీటునబుచ్చిన” తర్వాత “బంధమగు౯ మనమ్ము గుణ బంధమున౯ బడెనేని" యన్నాఁడు కపిలుఁడు, పద్యాంతర సవరణ మనవసర మనుకొందును. ఏలనన భక్తియోగ మీ బందము ద్రెంచు నన్నది స్పష్టముగనే యున్నది. "కంతు డనంత లీలల౯ రంతులు సేసియు౯ ముని మొల్కనవ్వులచే నూర్వశిని పుట్టించినాఁడు. ధ్రువ ఋషభాదుల చరిత్రలు మనోహరములుగా కధితములైనవి. “నభోవలయోల్లంఘి ఘనాఘన ప్రతిఘన ప్రధ్వాన నిర్ధావితాఖిల ఘోరాసురమౌ" నృసింహ లీలయు, గరుత్మద్వాహనా రూఢుఁడై శ్రీహరి సార్వాత్మ్యముతో దీపించుటయు, గుభులు గుభుల్లటంచు దుగ్ధపయోధిని ద్రచ్చుటయు, మోహినీ వామన పరశురామ రామావతారములును, ముగిసిపోయినవి. 37 వ దశకమున నారంభమైన శ్రీ కృష్ణ, కథామృతము, 90వ దశకము వరకు, నేకనిర్ఘరిణిగా ప్రవహించినది. అయిదు వందల యేబది పద్యము లమోఘవాక్పటిమతో జాలువారినవి. చిప్పిలుకొంచు, వలనొప్ప౯, పచ్చని పచ్చికల్, చారువిలోకనల్, ఓయి చిరాయువై మనగ