పుట:నారాయణీయము.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

41


"నిన్నొరయన్నేరని యాచకాధములు దేవోద్యాన పాళీవిటుల్ "
"యన్యుల్ మది తర్కచర్చ – జన్మశతమం దీడేరుచుం ద్రీశ్వరా”
“భక్త్యాత్మక 'యోగమే సతత మాస్వాద్యంబు"

అను మాటలలో కవి కాలపు, శుష్క వేదాంతులయొక్క. యర్థ రహితాద్వైత చర్చలును, పంచమ దశకములో, అర్చిరాదిగతి నుగ్గడించుటచే భక్తియోగము పై యా కాలపు జనులకుగల యభిమానమును వెల్లడియగుచున్నని. ఇది దిక్ప్రదర్శనము మాత్రమే |

నాకు, కవిరాజు దీక్షితులు, విజయవాడతో పరిచితులైరి. తొలిచూపులలోనే యమలిన మొక యనురాగము నామది నలముకొనినది. నన్నొక మండలాధికారిగా నాతఁడు చూడలేదు. రసికుడననియే యాతని దృష్టి ! మొదటి సమావేశముననే తానేదో సభలో నవసరముగ రచించిన యొక వృత్తమాలను వినిపించినారు. ఆ శబ్దధార మా యవ్యాజ స్నేహమువలెనే యచర్చనీయవ్యక్త వ్యక్త మాధుర్యమై, నా శ్రుతికి హాయి నొదవించినది. అప్పుడే నేనంటినికదా, మీరేదేని మహాకావ్యమును బల్కుఁ డది రసవత్తరముగ భాసిల్లునని ! నా యభిలాష ఫలోన్ముఖమై, యీ నారాయణీయ ఫలము వారి స్వీయ సారస్వతోద్యాన రసాలమునుండి విగళితమై యాంధ్రుల దోసిటఁ బడినది. నేనెట్టి వాఙ్మాధుర్య మీ కవిరాజు వాక్కులలో నుల్లసించునని యనుకొంటినో యంతయు నించుమించుగా నారాయణీయమున నంతర్లీనమై స్రవించుచున్నది . విజయవాడయు మధురములగు రసాల కాటపట్టు నమ్ముడుశాల యనుట సొర్వజనీనమే ! కాని యిది సామాన్యమైనదికాదు. భక్తి రసాలయము ! ఒకప్పు డోరుగల్లులో సాధ్యపడక యొంటిమిట్టలో శ్రుతి గోచరమైన మధురగానమే మరల నీ నారాయణీయమున దాదాత్మ్యముంది యించుక విస్పష్టముగ వినవచ్చుచున్నదనియే నా తలంపు!

శ్రీకృష్ణకర్ణామృతములో, భర్తృహరి సుభాసితాంధ్రీకరణములో, భద్రాద్రిగోపన్నగారి దాశరధీశతకములో, ముఖ్యముగా, పోతనభాగవతములో ప్రతిబింబించిన తెలుఁగు నుడికారపు (గీర్వాణ వాణీ సమ్మేళనకాలపు) నిసర్గ మాధురి యిందును లీనమై, కృతికొక వైశిష్ట్యమును ప్రతిపాదించుచున్నది, కృతియో ప్రసిద్ధమైనది. కవికి దానిని సవరించు నధికారమా లేదు ! కాని యుదాహృత విషయమును, ఆది గ్రంథములో వలెనే విశదముగ, మధురముగ,