పుట:నారాయణీయము.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40


మగు వైషయికానందమును, (తౌర్యత్రికమును తన వేణువుగనే తనర) భారతప్రపంచమున కొక్కసారిగా, గొల్లపిల్లవాడుగ సవతరించి, శ్రీకృష్ణుఁడు విశ్వమోహనరూప లీలావిలాస వాఙ్మధురిమలతో ననంతరీతుల ప్రసాదించెను. ఋషులు, భక్తులు, కుటుంబులు, దీనులు, దరిద్రులు. వికలాంగులు, వారు వీరనక విశ్వసించినవారందరును, తరించిరి, ఆనందించిరి ; దైత్యులు, దుర్జనులు, నా స్తికులు నశించిరి. ఆ జగన్మోహన గోపొలావతార కథావిన్యాసమునే గీర్వాణవాణిలో భాగవతమనిరి. కేరళ వాఙ్మయులు నాభాగవతసారమునే నారాయణీయమనిరి. సంస్కృత భాగవతమును, కారణజన్ముఁడగు పోతన యనువదించెను. ఆంధ్రుల పుణ్యలోపముచేత నేకాదశస్కంధాదులంతరించి, మిగులు మిగిలినది. ఆ భాగవతసారమగు నారాయణీయమును, పోతన్న వలెనే పరమభాగవతుఁడగు, మేల్పుత్తూరు నారాయణభట్టు, మహితమధురసమాధురీ మంజులమగు నమరభాషాశైలిననుపమముగ, నతిలోకరమణీయముగ, రచించి యుండ, నిర్భరగురుభక్త్యావిర్భూతానందసందర్భులగు, కవిరాజు, శ్రీ కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులు, నిరాఘాట ధాటీసమాటోపముతో నిస్తులకమనీయ, నియమితమధుర పదసమన్వయ, నిరర్గళ విన్యాసముతో, తెనుగువారి పుణ్యమాయనుసట్లు, తేటతెల్లముగ తెనిగించిరి. ఆ తెలిగింపునకు, రసికా వతంసులు, స్వయముగ నుత్తమకవీంద్రులు రాజపదవీమాన్యులు నగు శ్రీ బూర్గుల రామకృష్ణారావుగా రూఁతయైరి. అహో ! ఎట్టి సమ్మేళనము ! బంగారుతమ్మికి వరిమళ మబ్బినది ! అచుంబితయగు కుముద కోరకకన్య కనులు విచ్చి యలరునప్పుడే యుదయేందుకిరణము లమృత ప్రకాశము నంకించిన తెఱగున, నాంద్రీకృత నారాయణీయమునకు నాదికవికి దేవుఁడగు, గురువాయూరు నారాయణుడే, కృతి నంకితమొనర్చుకొన్నాడు. ఈ భాగ్య మదృష్టవంతులకు గాక నొరులకెట్లు ప్రాప్తమగును ! కవియు, కవీడ్వరాశ్రితుఁడగు పోషక పితయు, కృతియు, ధన్యతగాంచినవి ! నారాయణభట్టజనమేజయాదులజాడ్య నివృత్తికితోడ్పడిన గురువాయూరు శ్రీమన్నారాయణుఁడు నిశ్శేషజాడ్యాపహుఁడై నన్ను, నాయట్టి పాఠకులను, శ్రోతలను నుద్ధరించుగాక ! -

ఆంద్రీకృతమగు కంబరామాయణము, తమిళసంస్కృతి నాంధ్రుల కెటులందిచ్చినదో యట్లనే యీ నారాయణీయము, కేరళుల హృదయ గాంభీర్యతను మన యెదుట సాక్షాత్కరింపచేయుచున్నది. కవి యెంతటివాడేని, కాలదేశవ్యవహారపరిస్థితుల కింఛుక యేని బద్ధుఁడు, బాధ్యుడు కాక తప్పదు.