పుట:నారాయణీయము.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సమీక్ష - 2

“కవిత్వవేది'

బ్రహ్మశ్రీ కల్లూరి వెంకటనారాయణరావు, ఎం. ఏ.

ఆనందమునే జీవకోటి నిరంతరము వాంఛించును. ఆనందానుభూతులను పరికించి, బరిశీలించి, బ్రహ్మానందమే పరమలక్ష్యమని యుత్తమమానవు లుద్ఘోషించిరి. బ్రహ్మము విశ్వవ్యాప్తము. మహావిశాలమగు నా బ్రహ్మానందమనుభ వించుటకు, జీవుఁడు బ్రహ్మమే కావలయును. కాని జీవుఁడు బ్రహ్మ కాగలఁడా యను విచికిత్సలో సందేహములు, ప్రబుద్ధులనుసైతము, తొందర పెట్టినవి, ఈ యూర్థ్వభాగాన్వేషణమును గట్టివైచి, బయలులోని బ్రహ్మమును తమలోని కీడ్వ నన్వేషకులు బ్రయత్నించి యది సాధ్యమని వక్కాణించిరి. ఆ వక్కణ యథార్థమైనదని భక్తులు, భాగవతులు, శరణులు నమ్మిరి. వారివారికి బ్రియములగు చారునా మోచ్చారణలలో, స్వరతిని జొప్పించి, వారానందమును బొందిరి. ఒకొక్క పవిత్రనామము నొక్కొక పంథకు మూలమై, తచ్ఛబ్ద స్వరతికి బ్రచారముఁ గల్పించినది. యెహోవా, అల్లా, పరమాత్మ, బుద్ధ, నారాయణ, శివ, రామనామము లట్టివ ! శివశరణులు, హరిశరణులు, బుద్ధ శ్రమణులు , జై నార్హంతలు, సూఫీనలీలు, భారతదేశమున వేలకు వేలు వెలసిరి. ఆయా పల్లెలలో, నాయా మహాత్ముల సమాధు లాసేతుహిమాలయ పర్యంతము నేడును, సర్వమతీయులచేత, పూజితము లగుచునేయున్నవి. ఆయర్చన లన్నియు నానందముకొఱకే ! స్వాత్మానందమే వీనిలో నన్నిటను ప్రధానమైనది ! -

బ్రహ్మానందముమాట యట్లుండ, ఇంద్రియానందము, వాగానందము, మానసికానందము, కాయికానందము, జిహ్వానందము మొదలగునవి మానవులకు నిత్యారాధ్యములై యున్నవి. కనుకనే యుపనిషత్తు 'లానందో బ్రహ్మ 'యని సూత్రించినవి.

వై షయికానందము మొదలుకొని బ్రహ్మానందము దాఁక, తానే " నిదర్శనమై, దర్శనమివ్వగఁల యాదర్శసర్వానందమయమూ ర్తిని, భారతలోకము కలియుగారంభముననే, కలలు గన్నది. ఎదురు జూచినది. బ్రహ్మానందమును, వైయక్తికమగు సాత్మానందమును, వాఙ్మనఃకాయముల కవసర