పుట:నారాయణీయము.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38


రింపవలెను. ఆలంకారికదృష్టితో విరోధభాసాలంకారము గ్రహించి, తాత్త్విక దృక్పథమున స్వభావోక్తియు జెప్ప నొప్పును. అపరోక్షజ్ఞానభూమిక అగ్నిరూపము. అగ్నిసర్వమును తనలో లీనము చేసకొని స్వస్వరూపాపత్తిని పొందించును. సాధకుల స్వస్వరూపాపన్నులఁ జేయువాఁడవను భావ మిందు ఆత్మస్వభావానురూపము వర్ణితము. ఈ భావమును విడువక వ్రాసిన పద్యము చూడుడు--

"అంగారమయుడ వెడసిన
 శృంగారమయుండ వెనసి చిత్రము "సంగే
 ప్యంగారమయ స్తత్ర" య
 నంగా నంగనలగూడి నర్తించి తట౯."

పై భావము స్ఫురింపకపోవునని యథామూలంగా వ్రాసినను భావమును గుర్తించు సూచన నిచ్చిరి. మూలభావములఁ గొన్ని తావుల విపులీకరించినను గొన్నియెడల సంగ్రహించినను మూలముతో విరోధింప లేదు. ఆ యా గుణముల ననువగు పట్టుల రసికులగు పాఠకు లెఱుంగగలరు.

ఈ కృతి సమర్పణ సమయమున సర్వజ్ఞపీఠాధీశులు జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సంయమీంద్రులు నారాయణ స్మరణపూర్వమైన తమ యాశీస్సుల బ్రహ్మశ్రీ వేదమూర్తులు ఉట్రవడియం కృష్ణశాస్త్రివర్యులముఖమున నందఁ జేసిరి. శ్రీ శాస్త్రిగారి సంస్కృతక వనము శబ్దార్థ మధురమైనది. వారి “యదునందనవందన శతకము" న శబ్దమాధుర్యము పోతనను మఱపించినది. శ్రీ గురువాయూరు దేవుని దర్శించి వెనువెంటనే పారవశ్యమున నుదయించిన శతకము వారి భక్తికినిదానము.

ఇంతటి సజ్జనాభినందనల నందిన యీ గ్రంథమును నారాయణార్పణము గావించిన కవియు, శ్రీ బూరుగుల రామకృష్ణరావుగారును భగవత్కృపా విశేషమున నితోధికముగ శబ్దార్థ ప్రతిపత్తి నంది సారస్వతోపాయనముల నర్పింప గల సామర్థ్యమును వారికి ప్రసాదింప శ్రీ కృపావిశేషము ననుసంధించెద -