పుట:నారాయణీయము.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

37


ప్రతిరూపమగు శ్రీ గురువాయూరు దేవున కంకితముగ నీ గ్రంథమును సముర్పించుట బంగారునకు తావి యబ్బినట్లైనది. ఇందలి సముచితరీతులకు ఉదాహరణము - నృసింహావతార ఘట్టమున

“తప్తస్వర్ణసవర్ణఘూర్ణచటులోదగ్రాక్ష ముద్యత్సటా
 వ్యాప్తోత్కంపినికుంచితాంతరము ఖడ్గాగ్రోరోగ్రజిహ్వాగ్రసం
 దీప్తప్రోద్ధతదంష్ట్రికాయుగమహాదిగ్దాద్రిరాడ్గహ్వరో
 ద్దృప్యాస్యమ్మయి మాయుపాస్య మిరవొందెన్ శ్రీనృపంచాస్యమై"

అను పద్యమున మూలమునందలి సమాసమునే గ్రహించి అవతార గాంభీర్యమును, భయంకరక్రౌర్యమును, స్ఫురించునట్లనువదించియు, తెలుఁగుదనమందు గల యభిమానము పురికొల్ప పాఠాన్తరముగ నీ క్రిందిరీతి పద్యము గూర్చిరి.

"పుటముం బెట్టినజాలు వాపసిమి కెంపుల్ నింపుకన్నుల్ సటా
 చ్ఛట నిక్క౯ వడి నింగికిం దుముకుచు౯ జంచద్గుహా ఘోరమౌ
 నటులౌ మోఁ మసిధారవోలె బదనై యల్లాడు జిహ్వాగ్ర ము
 త్కటదంష్ట్రాయుగళోగ్రమౌ నరమృగాకారమ్ము భావించెద౯".

ఈ రెండవ పాఠమున ఓజోగుణము లేని కొఱత గానరాదు. భౌతిక ప్రకృతితో రసస్పూర్తిగల యా కారవిశేషమును, సత్త్వప్రకృతితో భగవద్రూపమహిమను భక్తులు భావించెదరు. భౌతికశక్తులఁ బెంపొందిన హిరణ్యకశిపుఁడు మున్నగు రాక్షసులు వారి దృక్పథమున నాయాకారము తమ శక్తికి మించినదని భయపడవచ్చుఁగాక. ప్రహ్లాదాది భాగవతోత్తములు భగవన్మాథుర్యమునే భావించి యుండుటచే నృసింహాకారమును దర్శించినను వారికి ఉద్వేగము కలుగకుండుట నైజమనిపించి కవి యీ పాఠము వ్రాయుటెంతయు సముచితమని నాకు తోచినది.

మాతృకలోని వై చిత్రిని విడువని అనువాదమునకు మచ్చుపదియవస్కంధము 66 వ దశకము - 9 వ శ్లోకము-

“విరహేష్వంగారమయః శృంగారమయశ్చ సంగమే౽పి. త్వం|
 నితరా మంగమయ స్తత్ర పున స్సంగమే2పి చిత్రమ్ "

ఇందు "సంగమే శృంగారమయః, సంగమే౽పి తత్రపునః నితరాం అంగారమయః" అని విరోధము తోచును. అంగ= ఓయీ, నితరాం= మిక్కిలి, అరమయః = క్రీడించితివి, అని పదవిభాగమున సర్ధముజెప్పి విరోధము పరిహ