పుట:నారాయణీయము.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

ఆంధ్రుల జిహ్వారంగముల ననుపదము నాట్యమాడు తెనుఁగు నుడికారపు సొంపులు, శ్రీనాథుని సీసపాదముల యొయ్యారపు నడకలు. పెద్దనార్యుని యల్లిక జిగిబిగులు, ముక్కువారి ముద్దుపల్కుల సొబగులు, సూరనార్యుని చమత్కృతి సోయగములును నీయన రచనలో నడుగడుగునఁ బొడసూపుచుండును. అట్టిపట్టులు కొన్నిటిని నేను జూపి చెప్పుటకన్న రసికులకు అన్నిటిని బరికించి యానందించుట సరసమార్గము.

మా దీక్షితు లిట్టి రసవద్గ్రంథము లనేకములు రచించి సరసులగు నభిజ్ఞుల సత్కృతి గౌరవములందుఁగాక అని యాశింతును.

“సమానానా ముత్తమశ్లోకో అస్తు" అని యాశాసింతును-

మఱొక్కమాట

సహృదయాగ్రగణీయులు కేరళాధీశులు శ్రీ రామకృష్ణులు ఈ కృతికి స్వీకర్త లయినారు.

సువర్ణమునకుఁ బరిమళమబ్బినది.

కోమలమగు కృతికి సుకుమారుఁడగు పతి లభించుట, సుకృతములలో సుకృతము.