పుట:నారాయణీయము.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16


అని అనువాదము. ఈ రెంటిని సరిచూచినయెడ నేది మాతృకయో ఏది పుత్రికయో తెలియరాని భ్రమ కలుగుచున్నదే !

పిదప కాలవశుఁ డగు జీవుఁడు చను దక్షిణోత్తరయానములు వివరించుటయు దర్శనీయమును, మననీయమును..

ఈ కపిలావశారదశకము శాస్త్రీయ విషయనిబిడము. అట్టి యెడ విషయ కాఠిన్య మించుకంతయుఁ దెలియకుండ లలితాతిలలితపదబంధమున నింత మనోహరముగా రచన సాగించుట యసాధారణము,

ఇఁక నృసింహావిర్భావఘట్టమున. రౌద్రరసమున కనుకూలముగా నోజో గుణస్ఫూర్తితోఁ బరుషాక్షరయుక్త దీర్ఘ సమాసముతోడి గౌడీరీతిని కవితను నడిపించుట యెంతయు శ్లాఘ్యము.

“తప్తస్వర్ణసవర్ణఘూర్ణ చటులోదగ్రాక్ష ముద్యత్సటా
 వ్యాప్తోత్కంపి నికుంచితాంబరము ఖడ్గాగ్రోగ్ర జిహ్వాగ్ర సం
 దీప్తప్రోరద్ధత దంష్ట్రికాయుగ మహా దిగ్దాద్రిరాడ్గహ్వరో
 దృప్తాస్య మ్మయి మాయుపాస్య మిరవొందెన్ శ్రీనృపంచాస్యమై."

అని యీ యొక పద్యముతోఁ దనియక

“వలిభంగస్ఫుటగండమై పృథులహ్రస్వగ్రీవమై దోశ్శతా
 కలితోద్యన్న ఖపుంఖపుంఖిత రుచి క్రాంత్యుల్బణమ్మై నభో
 వలయోల్లంఘి ఘనాఘన ప్రతిఘన ప్రధ్వాన నిర్దావితా
 ఖిలఘోరాసురమౌ నృసింహమునకున్ గేల్మోడ్తు నీ మూర్తికిన్.

అని నృసింహ సింహనాదమున కనువాదముగా ననువాద మొనర్చిన యీ భాగము మనోజ్ఞమని యే సహృదయుఁ డనఁడు? .

ఇచట ఓజోగుణయుక్తముగా నిట్లు చెప్పియు అజామిళోపాఖ్యానమున విష్ణుదూతల పల్కులు మిగులఁ బ్రసాదగుణభరితముగాఁ జెప్పి హరిప్రసాదమును గన్నులకుఁ గట్టినట్లు రచించుట నుత్యము, ..

"పలుతీరుల్ శ్రుతులందు నాస్మృతులలో, భాసించు నాయా వ్రతా
 దులు పాపోపశమంబ సేయు.... మొదలున్' ద్రుంపంగలే - పాత్మలో
 పలిమాలిన్యము జిడు తోముటకుఁ ద్వత్పాదాంబుజ శ్రీ సవ
 ర్యల మించం గల దింక లేదనిరి దేవా ! త్వత్పదారాధకుల్.