పుట:నారాయణీయము.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15


ధారణములును గృహీతములై నట్లే తెలియఁ దగును. అట్టి ధారణయోగము వలనఁ దుదకుఁ గలుగు సమాధియోగము నొందుమని యుపదేశము. ధ్యాతృధ్యానములు తొఱుఁగఁగా క్రమమున ధ్యేయ మొక్కటియే గోచరించుస్థితి సమాధి. అనఁగా "అఖండ సచ్చిదానంద స్వరూప మగుట" అను పెద్ద విషయ మిటుల సంగ్రహించి సులభముగాఁ జెప్పఁగలిగిన యిట్టి కావ్యమే కదా కావ్యము ! పిదప భక్తి యోగము నుపదేశించును. అదియును భాగవతమున నొక ప్రకరణము, దానిలోని నిగ్గంతయు నొక పద్యమున మాత్రమే క్లుప్తమైనది .

“గుణగణముల్ మదీయము లకుంఠిత లీలలు వించుఁ బాడుచున్
 క్షణ మొకఁబాటులేని మది చారు సుపర్వ సరిత్రవాహ ధో
 రణి యగు భక్తి పుట్టును ; కరమ్మది మృత్యుభయమ్ము నెట్టఁ గా
 రణమని తెల్పినావుగదరా కపిలాకృతి దేవహూతికిన్.

ఈ ప్రకరణమంతయు చారుసుపర్వసరిత్ప్రవాహధోరణినే నడచినది. భక్తిస్వరూప నిరూపణ మెంతయు హృదయంగమము. అనంతరము పిండోత్పత్తిమొదలు జనిం చిన జీవుఁడు మరల దేహత్యాగముచేయు పర్యంతము నిరువదియైదు పద్యములకు మించి భాగవతమున వర్ణింపఁ బడినభాగ మిందు , రెండు పద్యములందుఁ దెల్పఁ బడినది. 'కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః' అని మూలమున ఏకాకారముగా నెనిమిది పద్యముల తుదనున్న మకుటమున కనుకూలముగా అనువాదమున “అమ్మకు దేవహూతికిన్' అనియు "కపిలాకృతి దేవహూతికిన్" అనియు అనువాద మట్లుగాక సహజసంభూతమట్లు రచించుట స్తుత్యము. ఈ ఘట్టమున ననువాదపద్ధతి తెలియుట కై మూలముతోగూడ ననూదితపద్యము చూపుటయు సముచితముగాదా!

“యువతి జఠరఖిన్నో జాతబోధో ప్య కాండే
 ప్రసవ గళితబోధః పీడయోల్లంఘ్య బాల్యమ్.
 పునరపి బత ! ముహ్య త్యేవ తారుణ్య కాలే
 కపిలతను రితి త్వం దేవహూత్యై న్యగాదీ?" అని మూలము,

“కలికి యసహ్య గర్భనరకమ్మున గాసిలి, యందు బుద్దియుం
 గలిగియు - నేలమీఁదబడఁగా నదిషోయిన, శైశవా ద్యవ
 స్థలఁ బడి యంతలో మరల దారుణ యౌవన మోహమందు మూ
 ర్చిలుఁ నరుఁ డంచుఁ దెల్పితివి శ్రీకపిలాకృతి దేవహూతికిన్"