పుట:నారాయణీయము.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14



"ప్రకృతి మహ త్తహంకృతి నధః ప్రముఖమ్ములు భూతపంచక
 మ్మొక పది యింద్రియమ్ములు నహో విషయమ్ములునున్ మనస్సు పా
 యక పురుషుండు నిర్వదియు నైదవ తత్త్వముగా నెఱింగినన్
 బ్రకృతిఁ దరింపవచ్చునని పల్కితి గాదటె దేవహూతికిన్."

అని సాంఖ్యమతమునఁ దెలుపఁబడిన యిరువదినాలుగు తత్త్వములఁదెలిపి యిరువదియైదవది పురుషుఁడని అరఁటిపండొలిచి చేతికిచ్చినట్లు చెప్పుట మెచ్చఁదగినది.

పిదప నా ప్రకృతిని (సత్వరజస్తమోగుణాత్మకమగు మాయను) నిరూపించి దానిని చాటునుపాయ మిట్లుపదేశింపఁబడును.

"ప్రకృతిగతమ్ములైన గుణవర్గములోఁ బురుషుండు చిక్క, డ
 ట్లొకతఱిఁ జిక్కె నేని యవి యూరక చిక్కులు పెట్టుచుండు ; మా
 నక ననుఁగొల్చి తత్త్వమనన మ్మొనరించిన దాఁటవచ్చు నీ
 ప్రకృతి నటంటివో కపిల బాలక ! అమ్మకు దేవహూతికిన్ ,

ఇందు పురుషుఁడు మాయాగతములగు సత్త్వరజస్తమస్సులకు లోఁబడడనియు అనఁగా స్వతంత్రుడనియు, అట్లయ్యును ఎన్నడైన లోఁబడెనా ఆ మాయ (ప్రకృతి) పెక్కు చిక్కులఁ బెట్టుననియు - ఆ ప్రకృతిని గెల్చుటకై భగవంతుని సేవించి తత్త్వ మెఱుంగుటయే యుపాయమనియుఁ దేట తెల్లము సేయఁబడెను.

పిదప భగవంతుని సేవించి సాక్షాత్కారము గావించుకొనుటకై యమ నియమాసనాదులగు ఆష్టాంగములతోఁ గూడిన యోగవిద్య నతిసూక్ష్మముగఁ దెల్ల మొనరించుట యరయఁ దగినది.

"స్థిరమగు నాసనమ్మున మధిం గల యెల్ల కళంక మీఁగఁగన్
 గరుడ ఖగాధిరూఢుని వికస్వర దివ్య విభూషణాయుధో
 త్కరుని దమాలనీలతనుఁ గాంచి సమాధి నిరూధీనందుమం
 చరసి వంచించినావు కపిలార్భకఁ యమ్మకు దేవహూతికిన్ .

భాగవతమున వివరింపఁబడిన యమనియమాసనప్రాణాయామప్రత్యాహార ధారణధ్యానసమాధులను యోగాంగములు దీనియందు సూచింపఁ బడినవి. ఇందు 'స్థిరమగు నాసనమున' అను నుపక్రమణముచే యమ నియమాభ్యాస పూర్వకమగు నాసనమని తెలిపికొనఁ దగును. పిదప భగవద్రూపధ్యానము చెప్పుటచే ధ్యానకవ్యవహిత పూర్వములగు ప్రాణాయామ, ప్రత్యాహార