పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక

సంపుటము 13


గ్రొచ్చి సంధులు బంధించి పలుకులు వాకట్టి బలంబు వోఁదట్టి [1]ద్వితీయ
భంగిం జేయుమనిన నతండు నట్ల చేసె నసురేశ్వరుండును నసువిదూరుం
డయ్యెఁ గావునఁ బగవారిం గలసి వర్తించుతుచ్ఛవర్తనుం డపకీర్తి రాకకు నైశ్వ
ర్యంబు పోకకు నెదురుకొని యుండుం గావున.

137


గీ.

[2]హంసునంతవాని కత్తెఱం గైనచో, నితరదనుజకోటి నెన్న నేల
మీఁదు దెలిసి వేల్పుమేలాటములు మాని, నిలువయ్య కీర్తి నిలుపవయ్య.

138


గీ.

తండ్రిఁ జంపినపగవాని దానవేంద్ర, నమ్మకుము తక్కురాజుల నమ్మరాదు
కృత్య మంతయు మాయందఁ గీలుకొనఁగఁ, జేయు నీకు నభీష్టంబు సేయువాడ.

139


ప్రహ్లాదుఁడు దేవతలపై విరోధించుట

క.

అని పలికినఁ బ్రహ్లాదుఁడు, తనమది దేవతలమీఁదితలఁ పుడిగి సుధా
శనవిమతమతము గైకొని, పెనిచె విరోధంబు సాధుబృందముమీఁదన్.

140


సీ.

నిప్పచ్చరం బయ్యె నిర్జరేశాసక్తి పావకుచేపట్టు పట్టు వదలె
శమనంబుఁ గనియెఁ దచ్ఛమనుమీఁదితలంపుకోణపుపక్షంబు గుంటుపడియెఁ
బాశపాణిప్రీతి పలుచన యై తోఁచె గాలిపై నెయ్యంబు [3]తీలు పడియె
ధనదానురాగంబు దవ్వులఁ దలచూపె శంకరప్రణయంబు క్రుంకువడియెఁ
దాపసులమీఁదితగులంబు తఱిఁగె వైష్ణ, వాగమంబుల తరితీపు బాగుదప్పెఁ
గుటిలదానవనిర్దిష్టకుత్సితప్ర, చారపారగుఁ డైనదేవారి కపుడు.

141


క.

కరుణార్ద్రవీక్షణుం డై, హిరణ్యకశిపుప్రసూతి యేకాంతమునం
బరమాప్తులైన రాక్షస, పరివృఢులం బలికె వినయపరిచితఫణితిన్.

142


క.

పెద్దఱికంబున మును మా, పెద్దలకును వేల్సుకులముపెద్దలకు మహో
ద్యద్దాంతిశాంతికర మగు, నిద్దపునీపలుకు మాననీయము కాదే.

143


సీ.

సంవర్తసమయభీషణనవజ్రివజ్రాభఘోష మై పటుహయహేష మగుచు
సప్తానిలస్కంధసంధిబంధవిభేదవేగ మై నిర్భరోద్యోగ మగుచు
ఫాలలోచనఫాలఫలకరీలివిశాలతేజ మై శౌర్యనిర్వ్యాజ మగుచు
శమనకటాక్షవీక్షణపాతసన్నాహఘోర మై యాయుధోదార మగుచు
నాదుమూలబలంబు నానాదిగంత, రాళముల వేరుపాఱి యుత్తాల మైన
నేమి సేయంగ నోపుదు రెంతవారు, నాదివామననిభ వామనాభిధాన.

144


గీ.

నిప్పుమీఁది నివుఱుకప్పెల్ల నొయ్య నే, పార నూఁది యూఁది ప్రజ్వలితము
చేయు హోమి యనఁగఁ జిక్కులన్నియుఁ [4]బాపి, నామనంబు దేర్చి తో మహాత్మ.

145
  1. ద్వితీయ్యభృంగిం
  2. హంసుఁడంతవాని
  3. తీలిపడియె
  4. బాశి