పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 2

నారసింహపురాణము. ఆ 3

113


క.

[1]ఎఱుఁగనికాలంబున నే, నెఱుఁగక దుర్బుద్ధి నైతి నెఱిఁగినతఱి మీ
రెఱుకపడఁ దెలిపినప్పుడ, మఱి యెఱుఁగకయునికి గలదె మాన్యవిచారా.

146


క.

గెలిచెద భూమీవలయము, గెలిచెద బలిపద్మతలము గెలిచెద దివియున్
గెలు పనఁగ నెంత యుద్య, ద్బలు లగుమీప్రాపు గన్నబలవంతులకున్.

147


ప్రహ్లాదుఁడు శ్రీవిష్ణువుపై దాడివెడలుట

క.

ఆయుధములు కంకటములు, నాయిత్తము చేసి దండయాత్రకు మీమీ
దాయాదులఁ గూరిచికొని, వేయరుగుఁడు సకలదిశలవెంబడి మీరల్.

148


సీ.

అని రాక్షసకుమారుఁ డర్హగుణంబులు విడిచి దుర్జనబుద్ధి వివశుఁ డగుచుఁ
దామసవిక్రియాస్థగితచేతస్కుఁడై యౌఁగాము లెఱఁగక యవఘళించి
త్రిజగత్కుటుంబి యై దీపించుగోపాలదేవునిపై వైరదృష్టి నిలిపి
తనతండ్రిఁ బట్టి చంపినపగ యీఁగుదు నీఁగకుండిన నన్ను నీఁగ యనరె
యనుచు శ్రీహరితనువులై యతిశయిల్లు, విప్రులకు ధేనువులకును వేదములకుఁ
బుణ్యతీర్థంబులకు నెగు ల్పొడమఁజేసె, జన్యజనకంబు లేకక్షణము లరయ.

149


వ.

ఇ ట్లాహ్లాదభరితాంతఃకరణుం డై ప్రహ్లాదుండు వామనుపలుకులయెడ సాద
రుం డగుచుఁ దత్సహితంబుగ నమరాహితులం దమతమయిండ్లకుం బోవం
బనిచి యనుదినప్రవర్ధమానస్పర్థానిర్ధౌతప్రణయహృదయుం డై [2]యయ్యద
యుండు జగత్రయగిళనోత్సాహంబున నుత్సేకంబు గైకొని యుండి యుండి
యొక్కనాఁడు.

150


సీ.

తొడిమలూడినజరద్రుమపుష్పములువోలెఁ జదలఁదారలు జలజలన రాలఁ
గ్రొత్తమెత్తిన యార్ద్రకుడ్యరేఖలువోలెఁ బేఁటెత్తి దిక్కుల బీఁట లెగయ
సమ్మెట నడిచిన సంతప్తలోహపిండమువోలె మిణుఁగుఱు లుమియ ధరణి
ధరణి పల్తాఱుఁ గుమ్మరిసారెయును బోలె గిరగిర నుడుగక తిరుపుగొనఁగ
గిరులు గోలాటమాడ నయ్యురగలోక, మురక వ్రేళ్లకుఁ బెకలంగఁ గఱకుటసుర
సమరసంరంబియై భేరిచఱనఁ జేయ, నందు గ్రందయ్యె భాంకారకందళములు.

151


సీ.

అశ్వరక్షకులార హయరత్నముల నెల్లఁ బల్లనకట్టుఁడీ పాటవమున
మావంతులాగ సంబాళించి ఘనపతాకంబు లెత్తుఁడు మత్తకరులమీఁద
సారథులార శస్త్రధ్వజంబులతోడ మెలపుఁడీ రథము లచ్చలము మిగుల
భటులార కదలుఁడీ చటులకార్ముకలతాజ్యాఘోషములు నభఃస్థలము మ్రింగఁ
ద్రిభువనాభీలభుజశక్తివిభవ మెసఁగ, దండయాత్రాభిముఖుఁ డయ్యె దనుజభర్త
యనుచు ఘోషించి [3]రిభమునం దధివసించి, రాజపురుషులు ఘంటికారావ మెసఁగ.

152
  1. యెరిగినకాలంబున
  2. నెయ్యదయుండై
  3. రిభవమద్దధివశించ్చి