పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 2

నారసింహపురాణము. ఆ-3.

109


దన వెంబడిం జనుదెంచిన యాక్రించుడెందంబుఁ బ్రవేశించుమని నొడివిన
నప్పడంతియు వేల్పుమెఱియని వీడుకొని క్రీడాభవనంబు సొచ్చి వియచ్చర
పతి తన్నుం బనిచినపని సఫలంబు గావించుటయు.

109


ఉ.

నోరును నోరుఁ గీల్కొన దనూలతయుం దను [1]నల్లిబిల్లి యై
కూరిచినట్టు లుండఁ దలగోక యెఱుంగక పుష్పబాణు పె
న్బోరున సీధుపానమున బుద్ధివిదూరత నిద్రవోవు ర
క్షోరమణుం ద్యజించి జరగు న్మదిరాంగన సంగదూర యై.

110


గీ.

ధనము రాజ్యంబు దనకొఱకునె త్యజించి, మాఱుసేఁత లెఱుంగక మార్తురకును
బ్రియము చెప్పి చరించు నాప్రియుని బాసె, మదిర పాతకములకెల్లఁ గుదురుచెలువ.

111


క.

దానవుఁడు మేలుకని మది, రానీరజవదన గానరామి కులికి నా
నానిలయాంతరములకుం, దానె యరిగి వెడకు హృదయతాపముతోడన్.

112


క.

వచ్చినచోటికిఁ గ్రమ్మఱి, వచ్చుం RST బూఁదోఁట సూచి వచ్చుఁ బ్రియముతో
నెచ్చెలులనడుగునడుగుల, మచ్చమరయు నొఱలుఁదెరలు మలఁగుంగలఁగున్.

113


వ.

ఇవ్విధంబున నవ్విబుధారి వధూవియోగధూమధ్వజదందహ్యమానమాన
సుం డై యానిశాసమయంబున నసమనయనకఠోరకంఠకుహరఘటితహాలా
హలఘుటికాచటులం బగుకటికిచీఁకటిని నిశాచరుం డగుటను నిర్భయుం
డగుటను నెఱి దప్పక గుప్పునం బ్రాకారలంఘనం బాచరించి చరాచర
విలోచనభయదజ్వాలాకరాళం బగుకరవాలంబు దక్షిణకరంబునం జళిపిం
చుచు విలపించుచు నుత్తరాభిముఖుం డై తత్తనూసౌరభంబు పులుగునొడు
వఁ గడువడి నడువం జొచ్చె నిచ్చట.

114


క.

మానవతి దలఁగి పోకయు, దానవుఁ డట చనినవిధముఁ దా నెఱిఁగి మహా
సేనలతో వెన్నాడె బ, లానలజలధరము ప్రహసితాననుఁ డగుచున్.

115


మ.

చరణాంభోరుహయావకాంకములు భూషాస్రస్తమాణిక్యముల్
తరులగ్నాంశుకఖండముల్ పథిలుఠద్ధమ్మిల్లమాల్యంబులున్
సరసాంగచ్యుతగంధకర్దమ మలోలస్వేదసౌరభ్యముల్
తరుణీరత్నము చన్నత్రోవఁ దెలిపెన్ దైత్యాన్వయస్వామికిన్.

116


క.

[2]విఘటికలోపల సురపుర, విఘటనలంపటుఁడు గాంచె విమలతరసుధా
లఘుజల మధరీకృతసం, కఘనము మానససరశ్శిఖాశేఖరమున్.

117


సీ.

వినవచ్చె దవ్వుల వెక్కివెక్కి యొనర్చు పరిదేవనధ్వని పాటపాట
నావిలాపములోన హా దైవమా యను విధ్యుపాలంభనవిధము దోఁచె

  1. వెల్లిబిల్లి
  2. విఘడియ