పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక

సంపుటము 13


రపంచానను నభ్యంతరంబునకుం బోవ విన్నవించి తదీయం బగుపంచానన
పీఠంబున వసియించి.

98


క.

ఉరగుల నురగాలయమున, ధరణి నరశ్రేణి దివిఁ ద్రిదశవర్గము దొం
తరగ యథాపూర్వస్థితి హరిహయుఁ డునుచుటయు బ్రహ్మ కద్భుత మయ్యెన్.

99


గీ.

శూలధరుఁ డేలెఁ గైలాసశైలదుర్గ, మబ్జసంభవుఁ డుండె సత్యస్థలమున
గూర్మి వైకుంఠుఁ డమరె వైకుంఠమునను, దానవకృతాంతరాయము ల్దలఁగుటయును.

100


క.

యాగపురోడాశము లను, రాగంబుల నారగించి ప్రబలబలభుజా
భోగములు సూచుకొనుచు, న్వేగన్నులవేల్పుఁ బొదివె విబుధశ్రేణుల్.

101


క.

దేవవిరహితము లగుదే, వావసధస్థలము లెల్ల నహరహ మమరా
ర్చావిభవపూరితము లై , భూవలయంబున కొసంగె భూరిసుఖంబుల్.

102


క.

వాసవుకతమున విగత, త్రాసము లై ముజ్జగములుఁ బ్రమదము నొందెం
గాసరసమమతి యగురా, కాసులగమికాఁడు మదవికారార్జితుఁ డై.

103


క.

మదిరయు మదిరాదేవియు, మదనాహవతంత్రవిధికి మర్మము దెలుపం
బదియైదువత్సరము లా, త్రిదశారియు భోగకాంక్షఁ దెమలక [1]యుండెన్.

104


సీ.

అష్టావశిష్టంబు లానవా లొకకొన్ని చక్కెరపానకా లొక్కకొన్ని
పచ్చితేనెలు గాఱుఫలము లొక్కొకకొన్ని కొన్ని దివ్యామోదకుసుమసరము
లేణమదంబును నిందుఖండంబులుఁ గలపినపూఁతపింగాండ్లు గొన్ని
యుఃహ్వుననూదిననుడువీథిఁదాఁకుదివ్యాంబరములు గొన్ని యనుముహూర్త
మును బరంపరగాఁ బంపు ననిమిషేంద్రుఁ, డూడిగపుగత్తియలచేత మేడలోనఁ
గ్రీడ లాడుచునున్న యక్షీణమదన, రాగరసమత్తమతికి నారాక్షసునకు.

105


గీ.

హారములును జతుర్విధాహారభాండ, నికరములుఁ బచ్చికస్తూరినికరములును
ననుచు లోనికి రాజయోగ్యంబు లైన, వానిఁ దెందేపగాఁగ దైవతవిభుండు.

106


గీ.

విభుఁడు చెప్పినవానిలో వృత్రవైరి, దానవులకునె కడు నెగ్గుఁ దలఁచుఁ గాని
నాకమునకును దక్కినలోకములకు, నాదృతానందసౌందర్య మందఁజేయు.

107


గీ.

వేఁటలాడించు [2]దుర్ద్యూతవిధులు దెలుపుఁ, గామశాస్త్రరహస్యసంగతులు గఱపుఁ
గాని నీతికిఁ జొరనీడు దానవేంద్రుఁ, గూల్పఁ బొంచి వసించిన కులిశపాణి.

108


వ.

అంతఁ గొంతకాలంబు చన్నపిమ్మట మరుత్కాంతుం డేకాంతంబునకు శాం
బరి నాకర్షించి మహామాయా నీవు మాయనుమతంబున నంతిపురంబునకుం
జని మదిరాకన్యక నయ్యన్యాయవర్తికడం బ్రవర్తింపనీక తొలంగి దూరంబు [3]సనఁ

  1. యుండ్డునూ
  2. దుద్యూత
  3. సని