పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 2

నారసింహపురాణము, ఆ -3

107


వ.

ప్రత్యుత్థానం బొనరించి యాదిత్యపతిం గౌఁగిలించుకొని యాతిథ్యం బొసంగి
తథ్యంబులు హితంబులు నైన వాక్యంబులు కొన్ని వక్కాణించి పిశితభు
క్కులశ్రేష్ఠుం డిట్లనియె.

90


శా.

అన్నా యన్నలుఁ దమ్ము లైనమిము ము న్నాక్షేపము ల్పల్కి నే
నిన్నా ళ్ళేలితి మూఁడులోకములు మి మ్మేప్రొద్దుఁ గారించితిన్
వెన్నుం డుగ్రుఁడు నల్వయు న్మనుచు బల్వీ ళ్ళాఁగితిన్ లోకర
క్షౌన్నత్యంబున కోపభోగములయం దాసక్తి గొంటిం గడున్.

91


గీ.

ప్రాజ్ఞుడవు నీవు నయకళాప్రౌఢమతివి, యాబృహస్సతి నీకూర్చునాశ్రితుండు
తాల్మి గలవాఁడ వోపుదు ధరణిభుజగ, సదననాకంబు లొక్కట నవధరింపు.

92


క.

ఏకాతపవారణ మగు, లోకత్రయ మేలు మసురలోకమును మరు
ల్లోకము సరిగాఁ జూడుము, నా కాప్తుఁడ వగుచు నుండు నాకాధీశా.

93


గీ.

అనినఁ గపటనాటకారంభనిపుణుండు, నేఁడు చిక్కె [1]మత్తికాఁడు నాకు
ననుచు వజ్రి దలఁచి హస్తాబ్జముకుళన, శాలి యగుచు దనుజపాలుఁ బలుకు.

94


మ.

తపముల్ సేయుచు వ్రస్సి క్రుస్సి విపినాంతర్వాసు లై పద్మజ
త్రిపురధ్వంసులచే వరంబు గొని దైతేయారిచేఁ జచ్చున
ట్టిపలాదుల్ నినుఁ బోలఁగాఁ గలరె కంటి న్వారిచందంబు నీ
యపరిక్షీణపురాతపఃఫలము లత్త్యైశ్వర్య మిచ్చెం దగన్.

95


గీ.

ఒకనితెరువు సనక యొకని నొప్పింపక, సకలలోకములును సాధ్యపఱిచి
యేలుచున్న నీదులీలావిభూతికి, దలఁకి రచ్యుతాదు లలఘుచరిత.

96


క.

ఏనుఁగుపల్లం బేడిక, పై నునిచిన తెఱఁగు గాదె భవదురుబాహా
స్థాని సుఖ మున్నరాజ్య, శ్రీ నాపై నిలుపుటెల్ల జితశత్రుబలా.

97


వ.

అటు లేనియు భవదీయచరణస్మరణంబునఁ గృతకృత్యుండ నై దేవర యాన
తిచ్చినప్రకారంబున నవికారవిచారుండ నై సచరాచరం బగునీజగత్త్రయం
బుం బాలించెదఁ [2]గ్రేడించి చనిన దనుజకుమారవర్గంబు నిసర్గస్నేహంబున
రప్పించి తత్త్వజ్జీవితంబు లిప్పించెద మీర లిచ్ఛానురూపంబు లగువిభవకలా
పంబుల నాపోవుచు నెడనెడ మదీయం బగునడవడికి వెడఁగుదనంబు గలి
గిన [3]నుడిగించుచు సుఖం బుండుం డని యాఖండ లుం డతనిచిటికెన[4]వ్రేలి
కీలితమణిశలాకాశకలం బగుముద్దుటుంగరం బొసంగిన నంగీకరించి రాత్రించ

  1. మత్తిగాడు
  2. గేళించి
  3. నుడిగింపుచు
  4. వ్రేలంగ్లీలితమణి