పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక

సంపుటము 15

లంబనన్యాయమున నించుమించుగాఁ గవికాలమును నిర్ణయించుటకుఁ దగిన యాధారములు చూపట్టుచున్నవి. ఎట్లనిన:- ఏతద్గ్రంథకృతిభర్త యగు ప్రోలుగంటి రంగప్రధాని నందెల చినయోబభూపాలుని దండనాథుఁ డైనట్టు లీగ్రంథమునఁ గృతిపతిప్రస్తావమున రాఘవమనీషిచే నీ క్రిందిపద్యములయందుఁ జెప్పఁబడి యున్నది.

సీ.

తనమండలాగ్ర ముద్దండారిమండల భూధరంబులకు దంభోళి గాగఁ
దనకృపారసము బాంధవసేవకాశ్రితోద్యానసీమకు వసంతంబు గాఁగఁ
దనచక్కఁదనము కాంతామనశ్చంద్రకాంతములకుఁ జంద్రికోదయము గాఁగఁ
దననీతివర్తన ధారుణీజనచాతకంబుల కభ్రాగమంబు గాఁగఁ
వెలసె నేరాజు సముదగ్రబలసమగ్ర, కమఠకర్మఠభుజపీఠగమితధరణి
యతఁడు నందెలనరసింగయాంతరంగ, తామరసహేళి చినయోబదానశాలి.


శా.

ఆరాజన్యశిఖావతంసచతురాశాం తావనీచక్రభృ
ద్ధౌరంధర్యుఁడు శత్రునిర్మథనవిద్యాశాలి లీలావతీ
మారాకారుఁడు ప్రోలుగంటి నరసామాత్యాత్మజుం డార్యర
క్షారంభుం డగురంగమంత్రి యొకనాఁ డాత్మీయగేహంబునన్.

మఱియుఁ బ్రథమాశ్వాసము 14 వ పద్యమున:-

సీ.

- - - - - - - - - - - -
నందేలచినయోబనాథహృద్వీణకు రంగుమీఱినతంత్రి రంగమంత్రి.

అనియు నున్నది. ఈ నందెల చినయోబనృపాలుఁ డారెవీటి బుక్కరాజు వంశములోని వాఁడైనట్లు పింగళి సూరనార్యుని కళాపూర్ణోదయకృతిపతి వంశావతారపద్యములవలనఁ దెలియవచ్చుచున్నది. ఆరెవీటి బుక్కరాజునకు బెద్దభార్య యగునబ్బలదేవియందు సింగరయ్య, రామవిభుఁడు, అహోబలుఁడు నని ముగ్గురు పుత్రులు పుట్టిరి. వారిలోఁ బెద్దవాఁ డగుసింగరయ్యకు నరసింగరాజు, నారయ్య, తిమ్మయ్య, యని ముగ్గురుకొడుకులు. ఆ ముగ్గురలోను నరసింగరాజునకు సింగరయ్య, నారయ్య, కుమారౌబళుఁడు, వరదరాజు, రఘుపతి, యనునైదుగురు కుమారులు గలిగిరి. అందు సింగరయ్యకు నరసింహరాజు, రఘుపతి, ఓబరాజు, ననిముగ్గురు కొమాళ్లు. వారిలో నరసింహరాజు కొడుకు ఆవళిచినౌబళుఁడు. ఇతఁడే యీమననారసింహపురాణకృతిభర్త యగు ప్రోలుగంటి రంగన్న ప్రభువు. ఈతని పినతాతలు నలుగురలో నారయ్య కుమారుఁడు నరసింగయ్య. ఈ నరసింగయ్య కొడుకు కృష్ణమరాజు. ఈతఁడే కళాపూర్లో