పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 1

నారసింహపురాణము. ఆ - 3

53


ధరవిధివిబుధరమణలం బిలిచికొని సురగురుసమేతంగా నంతర్ధానంబున
నవధరించి యొక్కయిక్కువ నధిష్టించి.

54


క.

భావించి కల్పతరువుల, రావిం చిట్లనియె హంసరక్షోహంసం
బావసుధాస్థలి నున్నాఁ, డీవేళ జగంబులెల్ల నేలి యలసుఁడై.

55


గీ.

ప్రతిదినాభ్యాసనైశిత్యపటిమ నెసఁగు, యోగవిద్యయు విడనాడి భోగపరత
నున్నదైతేయు మాయచే నోర్చుపనికి, నిదియె యభిసంధి వింటిరె వృక్షపతులు.

56


వ.

మీరు మీయేనుదెరంగులవారునుం గూడి కుతలంబున కరిగి యదృశ్యా
కారంబున దానవవీరునంతరంగంబు నధిష్టించి యతనికి నశ్రాంతవిశ్రాణన
పరాయణత్వంబు నుద్భోధింపఁజేయుండు పొండనిన నా[1]విదురువెల్లిపొదలు
గదాధరుపనుపు ననుసంధించుటకు నై వసుంధరకు నవతరించి దివిజారిహ
దయప్రవేశంబు సేయుటయు.

57


గీ.

సివము పట్టినకైవడి దివిజవినుత, పరివృఢునిబుద్ధి పాటిల్లెఁ బ్రౌఢగాఢ
వితరణస్ఫూర్తి కామినీవిభ్రమముల, గాముకునిబుద్ధి రాగంబు గ్రమ్ములీల.

58


సీ.

బలిమి విద్వజ్జనంబుల సమారాధించి గుప్తదానములుగాఁ గొన్ని సేయు
నాచార్యగురుమిత్రయాచకావళికెల్లఁ దుదలేక తోరహత్తుగ నొసంగుఁ
బేదలసాదలఁ బిలిపించి వారికోర్కికి నలుమణుఁగుగాఁ గేలికిచ్చు
యోగసిద్ధులమంచు నొకకొన్నిబూటకంబులు పన్నువారి కేప్రొద్దురాల్చు
వందిమాగధకవినటావళులనెల్లఁ, గనకవృష్టులఁ దడిపించుఁ గామినులకు
నభిమతార్థప్రదానంబు లాచరించు, వాసవారాతి వితరణోల్లాసి యగుచు.

59


గీ.

అడుగువారు లేని యట్టి దినంబున, సురవిరోధినోరు చొరదు కూడు
వ్యసనవంతుఁ డైనవానికిఁ గలుగునే, ధీరతయును నయవిచారతయును.

60


క.

అనుదినముఁ గరవటమునం, జస మించుక తివియఁ దివియ సంశీర్ణం బై
చనుగతి దానవుసిరి పలు, చన యయ్యె నసంఖ్యదానసంభావనలన్.

61


సీ.

వైకుంఠపురలబ్ధవైడూర్యరాసులు వైధాత్రపట్టణవజ్రమణులు
నీలకంఠావాసనీలమాణిక్యంబు లమరేంద్రువీటిముత్యాలసరులు
గరుడకిన్నరయక్షగంధర్వనగరాబ్జరాగదళంబులు నాగనగర
మరకతంబులు మహీవరజయసంప్రాప్తగోమేధికంబులుఁ గుందనంపు
గట్టునందలి పుష్యరాగములు జలధి, విద్రుమద్రుమఖండము ల్వెచ్చపెట్టి
పచ్చపైకంబు లేకుండెఁ బాకవిమత, విమతుఁ డాలోచనము లేని వెడఁగునీగి.

62
  1. (విదర)విదురువెల్లిపొద - విదురు=(రాల్చు)ఇచ్చు, వెల్లి=తెల్లని, పొద-కల్పకము.)