పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

వల దన్నవానిఁ గినియును, వలయు ననినవాని మెచ్చి వస్తువు లొసఁగుం
దల తోఁక లేనియోగుల, [1]ములుచఁదనంబున సురారి ముగ్ధుం డగుచున్.

63


గీ.

కొల్లచనినరీతిఁ గుంభినీగర్భంబు, నందు నణఁగినట్టు లసురవిభుని
వసువిసరము లెల్ల నిసుమంత యిసుమంత, చిక్కె వేగుఁబోకఁజుక్క లనఁగ.

64


క.

గణికాజనవంచితుఁ డగు, మణిహస్తునిలీల రిత్తమానిసి యగుచుం
గుణపప్రాయుం డై సుర, గణవిద్వేషణుఁడు గీర్భుఘనమై(?) యుండున్.

65


గీ.

బేలునీగిచేతఁ బేర్చినమున్నింటి, విత్తరాసు లెల్ల రిత్త యైన
యోగ [2]మూని ధనము లాగించుటకుఁ బూనె, నసురలోకభర్త యాక్షణంబ.

66


గీ.

అంటుదాఁకినఁ బోవు సిద్ధాంజనంపు, మూలికయుఁబోలె నభ్యాసముక్త మౌటఁ
బనికి రాదయ్యె యోగప్రధానగరిమ,విధియ ప్రతికూలమైనచో వెరవు గలదె.

67


వ.

ఇ ట్లమరుతరుపంచకం బసురపంచానను వంచించి యథాస్థానంబునకుం జని
దానవారికి నత్తెఱం గెఱింగించిన బ్రహర్షించి యావిరించిజనకుం డనిమిష
పతిం జూచి యి ట్లనియె.

68


చ.

విను మమరేంద్ర యీక్షణమ వేలుపుఁగొమ్మలు యక్షకిన్నరాం
గనలను దివ్యవారుణియు గాయకనాయకసంయుతంబుగాఁ
జని తనుసౌరభంబులఁ బ్రసన్నముఖాబ్జసుధాంశురోచులం
జెనకుల దానవాధిపునిచిత్తము మత్తము సేయఁగాఁ దగున్.

69


గీ.

అర్థసంపదలు నిరర్థకవ్యయముచేఁ, గొల్లపుచ్చి నట్టి గుట్టుతోడ
నున్నవానిఁ జేరి యొల్లన నవశిష్ట, ధనములెల్ల మీరు గొనుట యొప్పు.

70


వ.

ఇవ్వారుణి యవ్వారాశిమథనావసరంబున సుధావిభాగంబుతఱి నాచేతఁ బ్ర
యుక్త యై కాదె నాకరిపులం జీకాకుపఱిచె నిమ్మత్తకాశినిచేత నేతత్ప్రయోజ
నంబు ఫలించు ననుటయు బలభేది జలశాయియానతి నొనరించుటయు.

71


సీ.

రత్నంపుమెట్లఁ దోరము లైనవీణెలు సన్నపుసరకట్ల [3]కిన్నెరలును
గాహళమురజశంఖపణవకింకిణుల్ ముఖవీణలును దాళములును నాగ
నరములుఁ దప్పెట్లధరవీణలు నుపాంగములు నావజంబులుఁ దళుకుఁబసిఁడి
చుయ్యంకులును దేశిశుధ్ధాంగవిదు లైననట్టువల్ పాత్రలతెట్టువలును
బంచవన్నెలచిలుకలపంజరములు, మరులుగొని వెంట వెన్నాడు హరిణములును
గలిగి పూచినతంగేళ్ళగతి విభూషి, తాంగలై దేవతాంగన లవని కరిగి.

72
  1. ములుస
  2. యోగమూగి
  3. కిన్నరులు