పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

దానవనాథుపంపున నుదగ్ర[1]బలాఢ్యులు వెగ్గలంబుగా
మానిసిదిండిమూఁకలు సమస్తజగంబుల నాక్రమించి వై
మానికులన్ బలారిభవమాధవధాతలు మున్నుగాఁగ నె
చ్చో నిలుపోపనీక వెసఁ జోఁపిరి తేనియఁయీగలుంబలెన్.

47


క.

బొక్కలు చొఱఁబాఱిరి తము, నిక్కువలకుఁ బాపి దానవేశ్వర యోధుల్
కక్కనపెట్టిన గాలియ, [2]బొక్కుచు శేషాదు లైనభుజగాధీశుల్.

48


క.

ఉర్వీవలయం బంతయు, నిర్వీరంబయ్యెఁ బ్రజలు నెళవుల కెరవై
పర్వతముల బాథోధుల, [3]*చేర్వల వసియించి రధికచింతాపగతిన్.

49


ఉ.

లోకములెల్ల నిట్టు లతిలోకపరాక్రమవిభ్రమ[4]క్రమో
త్సేకధురీణుఁడై యసుర చేకొని యేలుచునుండ గాఢశో
కాకులచిత్తులై యమరు లందఱు దుగ్ధపయోధియుత్తర
క్ష్మాకటకంబునందు గడుసందడిగా గమిగూడి వాడుచున్.

50


సీ.

నిశ్వాసధారలు నిగుడించువారలు శిథిలమానసముల జివుడువారుఁ
దలయూఁచి తలఁయూచి తగ్గి మ్రగ్గెడువారు ముఖకాంతులకు ముచ్చముణుఁగువారు
నంతఃపురక్లేశ మరసి ఘూర్ణిలువారు శిశుదైన్యమునకునై చిముడువారు
మాటలాడఁగఁ బోయి మాట తోపనివారు మతిలేక చేతిది మఱచువారు
బాపురే దైవమా యని పనుపువారు, నిది మహోత్పాతమని హంసు నెన్నువారు
నగుచు దైవతమునిసిద్ధయక్షసాధ్య, వరులు బెగడంగఁ జూచి శ్రీవరుఁడు పలికె.

51


శా.

ఓహో మీ రొకయింతసేపు నిలుఁ డే నూహించి లోకత్రయ
గ్రాహిన్ దేవవిరోధిఁ ద్రుంచునయముం గావించెదన్ మీకు నే
లా హైన్యంబు సహింప యోగవిభవోల్లాసంబుచే వాని కీ
మాహాత్మ్యం బొనగూడెఁ గాక యితరు ల్మాఱే నే మనుగ్రాసికిన్.

52


క.

మాయాబలమున రాక్షస, నాయకుని జయించి శంభునలినాసమరు
న్నాయకముఖ్యులు మెచ్చఁగఁ, చేయుదు భద్రంబు సిరులు చేకుఱు మనకున్.

53


వ.

ఆ రాక్షసుండు త్రిలోకాధ్యక్షుం డై యునికి మానవమానంబున లక్షహాయ
నంబు లయ్యెఁ దదీయం బగుపుణ్యఫలం బగు నింతియ యకర్కశనయ
తర్కనిపుణుండ నై సర్వంబును శుభోదర్కంబు చేసెద మీరు మీవలసపట్టు
లకుం జనుం డని పచ్చపట్టుబట్టగట్టు దేవర వియచ్చరుల నుపలాలించి విష

  1. బలాగ్నులు
  2. బుక్కుచు
  3. ....ర్వల వసియించి
  4. క్రమోచ్ఛేక