పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 1

నారసింహపురాణము ఆ - 3

51


క.

నియ్యానతి గలిగినచో, నియ్యాన సమస్తదేవనివహము నెల్లం
గయ్యంబునఁ బనిమార్చెద, రియ్యసురులు నీవు వీరి నేలుట తగదే.

37


క.

ఆరూఢశౌర్యసంయుతు, లై రణమున భయము లేక హాలాహలశిన్
శౌరి నజునైన గెలుతురు, వీరలు నీమూలబలము నీరవరేణ్యా.

38


క.

ఆట్టట వేలుపుగమిఁ జే, పట్టకుమీ ప్రాఁతవారి పట్టుడగకు నీ
యట్టి మహాత్మున కేటికి, పట్టువడ న్వీరకర్మధర్మ మడంపన్.

39


వామనుఁడు ప్రహ్లాదునకు హంసునికథ చెప్పుట

వ.

ఏతదర్థంబై యొక్కయితిహాసంబు గల దాకర్ణింపు మని వామనుం డారాక్ష
సాధ్యక్షుతో ననియె. మున్ను సుమాలివంశకుశేశయహంసుం డగు హం
సుండను దానవోత్తముండు వెలయు నబ్బలియుండు.

40


క.

తలమా సూడినమొదలున్, జలరాసులనీఁదు సప్తశైలము లూఁచున్
జలజల జుక్కల రాలుచు, నిలరాచు న్భుజగకులము నేఁచు న్వేఁచున్.

41


క.

సురలోకమువారల నీ, నరలోకంబునకుఁ దెచ్చు నరసురలోకే
శ్వరుల భుజంగేంద్రలోకాం, తరమునఁ గావించు దోర్మదము పూరించున్.

42


సీ.

ఆతపత్రచ్ఛాయ నరుదేరనొల్లఁడు నందన[1]వనినీడయందె కాని
యొఱగుముండా[2]మీఁద నొఱగంగ నొల్లఁడు రంభపాలిండ్లయోరలనె కాని
పార్థివం బగుభుక్తి పాటింపఁగా నొల్లఁ డలఘుసుధాసుధారలనె కాని
గజరథాశ్వముల నెక్కఁగ నొల్లఁ డమరర్షితతికృతబ్రహ్మరథంబె కాని
సత్యలోకంబుఁ బాలించు శంభులోక, మేలు శ్రీవిష్ణులోకంబు లాలనంబు
సేయుఁ బాతాళసురపదక్షితితలముల, [3]నుంబళికి నిచ్చుఁ దనుగొల్చియున్నప్రజకు.

43


క.

యోగబలంబుస నతఁ డీ, లాగున నానానిలింపలాఘవకరుఁ డై
యాగములు సేసె సిరు లుప, యోగించె నవీనశక్తి నొనరెం దనరెన్.

44


ఉత్సాహ.

హరునిఁ గొల్వఁ డజు భజింపఁ డంబుజాక్షసేవకుం
జొరఁడు హోమవిధికి రాఁడు సూర్యుఁ బేరుకొనఁడు సు
స్థిరచతుర్ద్వయాంగయుక్తదివ్యయోగసిద్ధివి
స్ఫురితుఁ డై నిశాటరాజు పొడవువడసెఁ గీర్తులన్.

45


క.

జలములు నగ్నులు నింధన, ములుఁ దక్రక్షీరదధి[4]సమూహమునుం దే
నెలుఁ దండులములు మొదలుగఁ, గలిగించు నతండు యోగగౌరవసిద్ధిన్.

46
  1. వననీడ
  2. ఒరగుమూఢా
  3. యుంబశి
  4. సమూహమునం