పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

278

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక

సంపుటము 12


బేఁటెత్తి కెరలు[1]గ్రీయూటతేటల చంద్రకాంతము ల్తాపప్రశాంతి చేసెఁ
జిమ్మచీఁకటిపేరిచీడ యంతయు వీడి బ్రహ్మాండభూజంబు పల్లవించె
నడరె నగవాసచటులాట్టహాసవాస, వకరికరికాండకాండకేవలసఖములు
దీప్రకాంతిప్రసారితదిఙ్ముఖములు, జలజరిపుసింహనఖముల [2]తళుతళుకులు.

149


ఉ.

శీతలవాతపోతముల చేతులు చూచుచుఁ గల్వలచ్చి కేం
తేతను పావహిల్లఁ దగుదీవెన లిచ్చుచుఁ బ్రత్యగారముం
బూతముగాఁగఁ బాదతలము ల్పచరించుచు జ్యోతిరాగమ
ఖ్యాతునిలీల శీతకిరణాకృతి ప్రౌఢిమచూపె నేర్పునన్.

150


వ.

అప్పుడు కకుప్పులం గుప్పలించుచుఁ దప్పుతారి యోలంబుల నణంగిన
కాలాంధకారంబు దూరంబుగ వెడలించుచు నుడివోనిరతులం బతుల
చేత [3]సదమదమైనముదవతీజనంబులకు ముదంబొదవించుచు నదీతటంబులఁ
బుటపాకచటులం బగువియోగవేదనాజాతవేదంబున ఖేదంబునొందు విర
హుల కతినిగ్రహకారి యగుచు నగుమొగంబులం జిగిదొలంకు జీవంజీవం
బులకుఁ జేవదెచ్చుచుఁ బచ్చవిల్తునకు నిచ్చకంబును గమ్మతెమ్మెరకు సమ్మతి
యును గలువకుం జలువయును గైరవంబులకు గౌరవంబును నమృతంబు
నకు సుముఖత్వంబును సమకొల్పుచు వెలఁదివెన్నెల మిన్నును న్నేలయుం
గప్పి కర్పూరపరాగపర్వతంబు లేకీభవించి యుద్రేకించె నన విజృంభించె
నత్తఱి మత్తకాశినీచిత్తంబులు సీధురసాస్వాదాయత్తంబు లయ్యెఁ దత్తత్పదార్థ
సార్థంబులు ప్రబలప్రసారితంబు లయ్యె నయ్యాతుధానుండు మానవతీ
సహితుండై బహువిధచమత్కారప్రకాశం బగునొక్కవివిక్తప్రదేశంబు
నందు నాసీనుం డగుటయు.

151


గీ.

పాటలప్రసూనపల్లవభంగశీ, తలము లైనసీధుధార లాని
గ్రీష్మతాపజనితఖేదంబు నదలించు, సతులఁ జూచి విభుఁడు మతిఁ జెలంగె.

152


క.

జలరుహకర్ణికమీఁదటఁ, దల మగుపూఁదేనెకరణిఁ దరుణి యొకతె వె
గ్గలమగు మధుపూరము కర, తలమనుచషకమునఁ బట్టి ధవు మెప్పించెన్.

153


క.

మును దా మానఁగ నొకచవి, వెనుక న్విభుఁ డాననాన వేఱొకచవి యా
వెనుక సఖులాని యిచ్చుట, వనితలకుం బెక్కుచవులు వారుణి యొసఁగున్.

154


చ.

కొదలు మృదూక్తులు న్మదవిఘూర్ణితలోచనపంకజంబులుం
బదిలము లేని సిగ్గుమనుపట్లును దొట్రిలుచున్నయానము

  1. గ్రియ్యాట
  2. ధళుధళుకులు
  3. సదమదయైన