పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 6

నారసింహపురాణము. ఆ - 2

277


గప్పె రోదోంతరాళ మఖండఖండ, పరశుగళమూలకాకోలబాంధవంబు
బంధకీగాఢరాగానుబంధబంధు, రము సగంధాంధకారపూరము గరంబు.

140


గీ.

కాళయాహికినై పింఛమౌళి గలఁపఁ, బొరలు కాళిందిలోని బుద్బుదసమేత
భూరినీరప్రవాహంబుఁబోలెఁ దార, కాసమన్వితఘోరాంధకార మడరె.

141


క.

అసితరసాలశరాసము, భసలకలభగుణముఁ గూర్చి [1]ప్రసవాయుధుఁ డ
య్యసతుల నుపపతుల [2]వెసం, గసుగందనికలువయంపగములం బొదివెన్.

142


సీ.

వేగింపరానివియోగనహ్నులఁ గ్రాఁగి జక్కవపులుగులు పొక్కి పడియె
జడిపట్టి వర్షించె నుడివోక పథికారుణాధరానేత్రపయోధరములు
బలిమిఁ గల్వకుఁబోవఁ బయనంబు గాఁజొచ్చెఁ దామరనుండి లక్ష్మీమృగాక్షి
పతివోవఁ జింతాభిహత లైరొ యన దిగంగనలు చీఁకటిచేతఁ గప్పఁబడిరి
యపు డరాజక మైనరాజ్యంబునకును, రాజపుత్త్రుండు వచ్చుసంరంభ మెసఁగ
నుదయశైలసమీపంబు నొయ్యఁ జేరె, యామినీకాముకుఁడు కళాధాముఁ డగుచు.

143


గీ.

గగనభల్లూకవిభు మోముజిగి యనంగ, రాత్రికేతకభూరుహప్రసవకాంతి
యనఁగఁ దూరుపు తెలతెలనయ్యె నంతఁ, దారకారాజకరరాజి తారసింప.

144


గీ.

పంచజనుకుక్షి భేదించి పాంచజన్య, మంజనాభుండు యదువంశకంజనాభుఁ
డెత్తిపట్టిన చందంబు నిరవుకొలిపె, రక్తరుచి యైనశశియున్కిఁ బ్రథమశిఖరి.

145


ఉ.

వ్రేతలవీఁగుఁజన్నుఁగవక్రేవలఁ గుంకుమపంకపత్రసం
ఘాతము గప్పినన్ దివసకాంతసుతాసలిలంబు లోచన
ప్రీతి యొనర్చులీల నృపబృంహితనూతనచంద్రతామ్రచం
ద్రాతపసంగలబ్ధిఁ జెలువారె శిలాకఠినాంధకారముల్.

146


క.

గరళశిఖు లారగించిన, హరమూర్తులువోలెఁ దారకాధీశకరో
త్కరము కర మద్దవడి భీ, కరతిమిరౌఘముల నిలయగతములు చేసెన్.

147


చ.

సకలదిగంతరాళనిపసత్తిమిరంబులఁ గత్తిరించి పూ
ర్ణకుముదమిత్రచంద్రికలు నవ్యరుచిం దిలకించెఁ బాతక
ప్రకరముఁ ద్రుంచివైచి కడుభాసిలు యోగివరేణ్యుబోధవా
ఙ్నికరములీల శాంతమును నిద్దము నైనవికాససంపదన్.

148


సీ.

కొనవాఁడినిడుపముక్కులఁ ద్రుంచిత్రుంచి వెన్నెలమీఁగడలు మ్రింగె నెలపులుఁగులు
పేరెండతాఁకున బీఱువోయిన కైరవోత్పలావలిమేన మబ్బు వచ్చెఁ

  1. ప్రసవాయుధుఁ డైయ్యసతుల
  2. నెసంగసుగంద్దని