పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక

సంపుటము 15


మ.

అమృతప్రాయవిశేషకావ్యరచనాహంభావవాగ్రామణీ
రమణీమూర్తివి; వేదశాస్త్రవివిధగ్రంథార్థనిర్ణీత; వే
కముఖబ్రహ్మవు; యాజుషప్రకటశాఖాధర్మధుర్యుండ; వ
ర్యమతేజుండవు రాఘవార్యహరిభట్టా! సత్కవిగ్రామణీ!

అనువరాహపురాణపద్యము పైవిషయమును దెలుపుచున్నది. మఱియు నితనిగ్రంథములయందలి యాశ్వాసాంతగద్యములం బట్టి యితఁడు భారద్వాజసగోత్రుండును రాఘవమనీషి పుత్రుఁడును, హనుమదుపాసకుఁడును, అష్టఘంటావధానపరమేశ్వరబిరుదాంకితుఁడు నైయున్నట్లు తెలియవచ్చుచున్నది. ఆశ్వాసాంతగద్యములవలననే కాక వరాహపురాణము నందలి

గీ.

అష్టఘంటావధానవిశిష్టబిరుద, నీవు రచియింపదలఁచిన నిరుపమార్థ
రమ్యమగు నీవరాహపురాణకావ్య, మంకితము సేయు నాపేర నంచితముగ.

అనుపద్యమును బట్టియు నీతనికీ (అష్టఘంటావధాన) బిరుద మున్నట్లు విశద మగుచున్నది. ఇది యెవ్వరిచే నీయఁబడినదో తెలియదు. ఇతఁడు తనచే రచియింపఁబడిన వరాహపురాణమున:-

సీ.

వరుణదిగ్వీథి నేపురమునఁ బ్రవహించెఁ బావనసలిలసంపన్న పెన్న
దీపించె నేపురి గోపికామానసాస్పదవర్తి చెన్నగోపాలమూర్తి
బాసిల్లె నేవీటఁ బ్రహ్లాదభక్తివిశ్రాణి కొండనృసింహశార్ఙ్గపాణి
యేపట్టణంబునఁ జూపట్టె హితపద్మహేళి వీరేశబాలేందుమౌళి
చతురచతురంగబలరత్నసౌధయాథ, సాలగోపురతోరణ సకలవర్ణ
పౌరవారాంగనాజనప్రముఖవస్తు, మేదురం బట్టికంబముమెట్టుపురము.

అని కంబముమెట్టును వర్ణించియుండుటచే నాకంబముమెట్టయే యీతని నివాసస్థల మయియుండునేమో యని తోఁచుచున్నది. మరియు మత్స్యపురాణమునందలి:-

శా.

భారద్వాజసగోత్రసంభవుఁడ నాపస్తంబుఁడన్ దిమ్మమాం
బారాజద్వరగర్భసంభవుఁడ రామక్ష్మాసురానేకజ
న్మారూఢాధికపుణ్యలబ్ధ హరినామాంకాప్తసత్పుత్రుఁడన్
శ్రీరామానుజపాదపద్మయుగళీచింతాసమాయుక్తుఁడన్

అను పద్యమువలన నీకవి యాపస్తంబసూత్రుఁడును, రామమనీషికిని దిమ్మాంబకును బుత్రుఁడును, వైష్ణవమతాసక్తుఁడు నైనట్లు తెలియవచ్చుచున్నది. ఇతఁడు మొదట వరాహపురాణమును రచియించి కంబముమెట్టు కరణమగు