పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 4-5

నారసింహపురాణము. ఆ.1

183


ప్రేమతోఁ బంచాక్షరీమంత్రరాజంబు జపియించు సంతతాచారపరులు
బాహ్యంబు మఱచి యా[1]భ్యంతరమ్మున మిమ్ము ధ్యానంబు సేయు పుణ్యస్వరూపు
లన్య మెఱుఁగక శైవమార్గానురక్తిఁ, బొదలుచుండెడు విశ్రుతాద్భుతచరిత్రు
లలఘుపుణ్యులు భవబంధములు త్యజించి, ప్రమథులై మిమ్ము సేవింతు రమరవంద్య.

115


నిరోష్ఠ్యసీసము.

సతతసత్యాకార చంద్రశేఖర శైలతనయాధినాయక దైత్యహరణ
గరళసంక్రాంతకంధర దయాసాగర హరిరాజకటక యనంగదళన
గంగాధర యహార్యఖండనాద్యాశాదళేశార్చిత శ్రీశ హితగణేశ
ఘనగజాజినచేలకలితకటిస్థల రజితాద్రినిలయ సారజ్ఞరసిక
ఖరఖరానలశశినేత్ర కాంచనాగ, శార్ఙ్గరంజితకరకంజ చక్రహస్త
నిశితసాయక నిఖిలార్థ నిత్యచరిత, సకలజగదయనయద రసాశతాంగ.

116


చ.

జయజయ పార్వతీరమణ చంద్రహుతాశనసూర్యలోచనా
జయజయ దేవతానివహసంతతసన్నుత భక్తవత్సలా
జయజయ పద్మజాదిమునిసంఘనిషేవితభావభావితా
జయజయ వామదేవ గజచర్మధరా బహుధర్మసాదరా.

117


వ.

అని యిట్లు దానవవీరులు సాక్షాత్కరించిన దాక్షాయణీవల్లభుని ననేకవిధం
బుల సన్నుతించి మఱియు నిట్లనిరి.

118


సీ.

విను విరూపాక్ష నీకనికరంబునఁ జాలఁ బొదలి హిరణ్యాక్షపూర్వజుండు
భూస్వర్గపాతాళములు మూఁడు నరికట్టి గరిగంటిగాని సౌఖ్యములఁ దనరి
విభవసంపూర్ణుఁడై వెలసియుండెడిచోట దంష్ట్రాకరాళవక్త్రంబుతోడ
నరసింహరూపంబు ధరియించి కఱివేలు పుక్కుఁ[2]గంబము చించి యుఱకవెడలి
తొడలపైఁ బెట్టి దైత్యేంద్రు నడఁగఁబట్టి, శితనఖరశిరములఁ గుక్షి చీరివైచి
సకలరాక్షసబలమెల్ల సంహరించి, తత్కుమారునిఁ గాచె నంధకవిదారి.

119


క.

ఆనరకేసరినాసా, నూనానిలనిహతిఁ గెరలునురుదంష్ట్రాదం
డాననదహనజ్వాలకు, దానవసంతానములు పతంగము లయ్యెన్.

120


వ.

మఱియును.

121


సీ.

హలహలారవనర్తనారంభరంగమై మేటిజిహ్వికకోల మెఱుఁగులీనఁ
జిటచిటారభటితోఁ జెలఁగుదంష్ట్రాటంకసంవర్తవహ్ని పోసనముగొనఁగ

  1. యభ్యంతరంబు - మూ
  2. కరివేల్పు వుక్కు - మూ