పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

322

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక

సంపుటము 13


క.

జలధిపతిబలపరాక్రమ, ములు జలలిపులుగ నొనర్చి ముచ్చెరువుజలం
బులు ద్రావించిన నీయు, జ్జ్వలవిక్రమ ముగ్రతరము శత్రుధ్వంసీ.

36


క.

గంధవహుబాహుబలధౌ, రంధర్యము బుజలువైచి రక్షస్సేనా
సింధువు నుబ్బించిన నీ, బంధురరణకౌశలంబు ప్రస్తుతిఁ గనదే.

37


క.

ధననాథు నతని చెలికా, నినపోలెన్ భైక్షవృత్తి నిలిపితివి జనా
ర్దనుఁ డెన్ను నెపుడుఁ గూరుచు, జనములలో నీప్రభావసంపల్లీలల్.

38


క.

దానవకులవర్ధన యీ, శానశిరశ్చంద్రరేఖ సౌధస్థలసం
దానితదీపకళికగా, వేనిలిపితి వొక్కొ నిబిడవిక్రమగరిమన్.

39


క.

సురలోకము నరలోకము, నురగాధిపలోకమును సముజ్ఝితశత్రూ
త్కరముగఁ [1]బాలించెడునీ, విరివికి నొకకొదవ గలదు విను మెట్లనినన్.

40


క.

శ్రుతులకుఁ దత్తద్వితరణ, కృతులకు యతులకు నిలింపఖేతహతులకున్
శతపత్రలోచనుఁడు మూ, లతలం బగు [2]నారసాతలగభీరముగన్.

41


ఉ.

కావున నాదిమూలము నఖండపరాక్రమదాత్రధారచేఁ
దావు తెరల్చి తున్మక యుదగ్రము గాదు భవత్ప్రయత్న మో
దేవవిరోధి నిక్కము మదీయవచోవిభవంబు నిత్తెఱం
గీ వొనరించితేని గలఁడే నినుఁ బోలిన వీరుఁ డెయ్యెడన్.

42


క.

వామనసూచీముఖముఖు, లై మెలఁగెడు నీ ప్రధాను లనువాసరముం
దామెన్నుదు రీవిధము మ, నోమార్గములందు దితితనూభవతనయా.

43


వ.

అని యమ్మహాస్థానంబుఁ గలయం గనుంగొనుటయు నెల్లవారలుఁ డద్విప్ర
తల్లజప్రోక్తంబు లుత్తమోత్తమంబు లని దైత్యసత్తమునకు విన్నవించి రావం
చనా[3]చుంచురుండు వెండియు నిట్లనియె.

44


క.

బలముగలనాఁడ శత్రులఁ, బొలియింపఁగఁ దగు సమూలముగ వేరున్నం
దల లెత్తు వెండియును హల, హలనిభవీరారికులలయాసలకీలల్.

45


సీ.

వేదతుల్యములు మద్విమలవాక్యము లిందు సంశయింపకుము రాక్షసకులేంద్ర
హరి సురావళి కెట్లు నాధారమై యుండు నతని గెల్వకయున్న నమరపదము
చేకూడు టెల్ల నస్థిరము గావునఁ బ్రయత్నము సేయు తజ్జయోత్సాహమునకు
నామిత్ర మగు నైన నాళీకదళనేత్రు, మాయావి గాన నమ్మక చరింతు
ననినఁ బ్రహ్లాదుఁ డిట్లను నవనిదివిజ, వర్య నీపల్కు లెల్ల నవద్యదూర
తరము లెచ్చోట నుండు శ్రీ వరుఁడు నాదు, కట్టెదుర నిల్వకున్న నేకరణి గెల్తు.

46
  1. పాలింప్పెడు
  2. సౌరసాతలగభీ
  3. చుంచురుండు అనియే వేఱొక్కచోటనుంగలదు.