పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక

సంపుటము 15

తుండు హరిభట్టు [1]............. అన్ని చెప్పఁబడియుండుటచే నీగ్రంథము కంటె

  1. హరిభట్టు భాగవతమున షష్ఠస్కంధముఁ గూడ నాంధ్రీకరించి యున్నాఁడు. అది మాపీఠికాపురమునందలి యాంధ్రపరిశోధకమహామండలియం దుండఁగా నేను జూచితిని. ఈ పద్యమున దానిప్రసక్తి యేల చేయఁబడలేదో తెలియదు. అప్పటి కీస్కంధ మాంధ్రీకరింపఁబడి యుండకపోవునా? అట్లయిన మఱి యెప్పుడు తెలుగు సేయఁబడి యుండును? ఈషష్ఠస్కంధకృత్యాదిపద్యముల యందుఁ గూడ నీతనికాలనిర్ణయాదుల కనుకూలించు విషయములు లభించినవి గావు. అందు:-

    శా. శ్రీ నీలాచలనాథు నంచితదయాసింధున్ జగన్నాయకున్
         నానావైభవసన్నుతున్ మునిజనానందాలమున్ సర్వదే
         వానీకా(మల?)మౌళిరత్నరుచిదివ్యాంఘ్రిద్వయీశోభితు
         న్సూనాస్త్రప్రభవాశ్రయున్ హరిని సంశోభింతు నెల్లప్పుడున్.
    మ. గురుకావ్యాదినిలింపసంఘములు వైకుంఠంబుతో సాటిగా
         బురణింపం బురుషోత్తమాహ్వయమహాపుణ్యస్థలం బంచు సా
         గరతీరంబున నీలశైలశిఖరాగ్రంబందు వేంచేసి యు
         న్నరమాకాంతుని భక్తవత్సలు జగన్నాథుం బ్రశంసించెదన్.
    మ. కర(క్రమ?) మొప్పన్ ముసలాయుధుండును సుభద్రాదేవియుం బార్శ్వభా
         గమునం బ్రేమయొనర్ప రత్నమకుటగ్రైవేయహారాంగద
         ప్రముఖానేకవిభూ- - - - - - -డై బ్రహ్మేంద్రగౌరీశ్వరా
         ద్యమరుల్ గొల్వ సుఖోపవిష్టుఁడగు నీలాద్రీశ్వరుం గొల్చెదన్.
    చ. ఎడపక విష్ణునిం బొగడ నెన్నఁడు నొల్లక దుర్మదంబునం
         గడుపులకై నరాధములఁ గావ్యముఖంబుల సన్నుతింపఁగా
         బొడమిన పాపజాలముల బొట్టణఁగం బొలియించు ముక్తిఁ బొం
         దెడుకొఱకై రచింతుఁ గృతి నీలగిరీంద్రున కర్పితంబుగన్.
    శా. ప్రస్కంధామరరాజ్యరక్షకుని భూభారాపహర్తన్ మహే
         శస్కందాభినుతప్రభావుఁ గమలాసంక్రాంతరాజన్మహో
         రస్కున్ విష్ణుఁ దలంచి భాగవతపౌరాణీయమైనట్టి ష
         ష్ఠస్కంధంబుఁ దెనుంగుఁ జేసెదను గృష్ణప్రీతిగా వేడ్కతో.
    క. కృతినాథుఁడు నీలాచల, పతియఁట శుకయోగి వచనభాషితమగు త
         త్కృతి భాగవతం బఁట యిది, మతిఁదలఁపఁగ నింతకన్న మాన్యము గలదే.
    వ. ఇవ్విధంబున సకలదేవతానాయకుండై యింద్రద్యుమ్నుసరోవరతీరంబున నీలగిరినిలయుం
         డైన జగన్నాథదేవునకు ననంతంబులైన సాష్టాంగదండప్రణామంబులు సమర్పించి తత్పాద
         పద్మంబులు మదీయమనఃపద్మంబునం గీలుకొల్పి తదర్పితంబుగా పష్ఠస్కంధంబు మతి
         గోచరించుకొలఁదిని దెనిగించెద.
    గీ. పరుసమునకు నినుము బంగారమును నొక్క, విధమ యైనయట్లు వీక్షసేయ
         శ్వపచుఁడైన విప్రవరుఁడైన శ్రీవిష్ణు, భక్తి కొక్కసమము పరిచరింప.
    క. సురవరమౌళి విరాజిత, సురుచిరరత్నప్రభాభిశోభితపాదాం
         బురుహద్వయాతినిర్మల, నిరుపమగుణసన్నివేశ నీలాద్రీశా!
    వ. అవధరింపుము.
    అను నీ పద్యగద్యములతో గ్రంథోపక్రమము సేయఁబడి:- “ఇది శ్రీ హనుమత్కటాక్షలబ్ధవరప్రసాద సహజసారస్వతచంద్రనామాంకరామవిద్వ
    న్మణికుమా రాష్టఘంటావధాన హరిభట్టారక ప్రణీతం బైన” ఇత్యాదిగద్యముతో
    షష్ఠస్కంధము పరిసమాప్తి చేయఁబడి యున్నది.