పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 1

నారసింహపురాణము - ఉపోద్ఘాతము

31

నున్నవాఁ డగుటకు సందేహముండదు. అట్లగుచో నీకవి శ్రీకృష్ణదేవరాయల రాజ్యారంభకాలమునకు ముందే యల్లసాని పెద్దనామాత్యునికంటెఁ గొంచెము పూర్వుఁడు గానో సమకాలమువాఁడు గానో యుండి—యాధునికకవుల కాదియందుఁ జేర్పఁబడుటకు బదులుగా—మధ్యకవుల కాదినో పూర్వకవులకుఁ గడపటనో చేర్పదగినవాఁ డగును. అంతియే కాని శ్రీవీరేశలింగము పంతులుగారు వ్రాసినట్లు, అప్పకవి యీతనిగ్రంథములనుండి లక్ష్యములను జేకొనకపోయినంతమాత్రమున నీకవి యతనికిఁ దరువాతివాఁ డేమో యని యూహించుట యుక్తము గాదు. అప్పకవిచే నుదాహృతములు గాని ప్రాచీనాంధ్రగ్రంథము లెన్ని లేవు? అవి యన్నియు నప్పకవికంటె నర్వాచీను లగుకవులచే రచియింపఁబడి యుండునని భావింపవచ్చునా? అంతకంటే—ఈతఁడు రచించినగ్రంథము లన్నియుఁ బురాణాంధ్రీకరణములేయై యుండుటం బట్టియు మత్స్యపురాణమున నీతఁ డొనర్చిన యపూర్వగ్రంథోపక్రమమును బట్టియుఁ బ్రబంధకాలమునకుఁ బూర్వుఁ డని యూహించుట యుక్తమేమో?

ప్రస్తుత మీకవికాలనిర్ణయ మంతకంటె సరిగా నొనర్చుటకుఁ దగిన ప్రబలాధారములు నాకుఁ గనుపట్టకున్నవి. ఇంతకు ముం దీమాత్రమైన నాధారముఁ గానరాని యీతని జీవితకాలనిర్ణయమున కిప్పు డీయాధారమైన దొరికినందుకు సంతసింపవలసినదే. ఇప్పు డీ నేఁజూపిన నిర్ణయాంశము గూడ నెంతవఱకు సరియైనదో చరిత్రపరిశోధనములం దభినివేశము గల తద్జ్ఞులు పరిశీలింపవలసియుండును; గావున నాభారము వారిపై వైచి యీనారసింహపురాణమునందలి కవిత్వముంగూర్చి యొకించుక వ్రాసి ముగించుచున్నాఁడను. హరిభట్టు గ్రంథము లిప్పటికి నాల్గు లభించినవి. ఇవి గాక యాతఁడింక నేవైన గ్రంథములు రచియించి యుండె నేమో తెలియదు. లభించిన గ్రంథములు (1) వరాహపురాణము, (2) మత్స్యపురాణము, (3) భాగవతషష్ఠైకాదశద్వాదశస్కంధములు, (4) ఈ నారసింహపురాణము. వీనిలో నీగ్రంథ మెన్నవదో సరిగా నిర్ణయింపఁజాలము. కాని మత్స్యపురాణమునందలి: – సీ....ధనమునకై నరాధముల సన్నుతిసేయఁ బొడమినపాపముల్ చెడుటకొఱకు ........... అనుదానింబట్టి, నరకృతి యీయఁబడిన వరాహపురాణము, మత్స్యపురాణముకంటె ముందు రచియింపఁబడెనేమోయని తోచుచున్నది. ఈ నారసింహపురాణమునందు:— సీ. విను రాఘవమనీషి! హనుమత్కృపావరలబ్ధకవిత్వవిలాసమహిమఁ దనరి యేకాదశద్వాదశస్కంధముల్ దెలిఁగించె మీతండ్రి ధీయు