పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక

సంపుటము 15

వారు నలుగురు నొక్కొక్క రిరువదిసంవత్సరము లుండి రనుకొన్న పక్షమునఁ జినయోబనృపాలుఁడును గృష్ణరాజుకాలమున ననఁగా క్రీ. శ. 1560-వ సంవత్సరప్రాంతమున నున్నవాఁడగును. అతని దండనాయకుఁడగు రంగప్రధానియు నతని కీగ్రంథమును గృతియిచ్చిన రాఘవమనీషియు నించుమించుగ నాకాలమువారే యగుదురు. ఈ రాఘవమనీషి పసివాఁడై యుండఁగా హరిభ ట్టీగ్రంథమును రచించి యెవ్వరికి నంకితము సేయకుండ మృతినొందిన వాఁ డనుకొన్నయెడలఁ దండ్రియనంతరము రాఘవమనీషి పెరిఁగి పెద్దవాఁడై రంగప్రధాని కీగ్రంథమును గృతియిచ్చునప్పటికి అత్యధమ మిరువది వత్సరము లైనఁ బట్టును. కావున నాయిరువదివత్సరములుసు రాఘవమనీషికాల మనుకొనుచున్న 1560 లోనుండి తీసివైచినచో హరిభట్టు నిర్యాణకాలము రమారమి క్రీ. శ. 1540-వ సంవత్సరప్రాంతమై యుండును. ఈతఁడు కొంచె మెచ్చు తగ్గుగా నేఁబది సంవత్సరములు జీవించియుండునని భావించినచో నీతని జీవితకాల మించుమించుగా క్రీ. శ. 1490-వ సంవత్సరము మొదలు క్రీ. శ. 1540-వ సంవత్సరప్రాంతమువఱకు నని యేర్పడుచున్నది. ఇది యిట్లుండ గా నీకృతిభర్త యగురంగప్రధానికి ముత్తాత యగుతిప్పన్న ప్రౌఢదేవరాయని దండాధీశ్వరుఁ డైన ట్లీ గ్రంథము నందలి:-

క. ఆమునిమణికులజలనిధి, సోమునికైవడి జనించె సురుచిరవిభవో
    ద్దాముఁడు సమధికసమర, స్థేముఁడఁ నౌప్రోలుగంటి తిప్పన ధాత్రిన్.
శా. అమంత్రీంద్రుఁడు ప్రౌఢరాయనృపదండాధీశసంపత్కళా
    సామగ్రి న్విలసిల్లి మల్లిసుమభాస్వత్కీర్తివిస్ఫూర్తి ను
    ద్దామాసాధ్యమహోమహత్త్వమున సంధాయుక్తి దోశ్శక్తి వా
    చామాధుర్యమునం బురావిభులతతో జర్చించు వర్చస్వియై.

అనుపద్యములవలనఁ దెలియవచ్చుచున్నది. ప్రౌఢదేవరాయలు క్రీ.శ. 1422-వ సంవత్సరము మొదలుకొని 1447-వ సంవత్సరము వఱకును రాజ్యము చేసినవాఁడు కనుక నాకాలమున నున్నప్రోలుగంటి తిప్పన్నకు మూఁడవతరమువాఁ డగురంగన్న (తరమున కిరువది సంవత్సరముల వంతునఁ బెంచిన యెడల) క్రీ. శ. 1507-వ సంవత్సరప్రాంతమున నున్నవాఁ డగును. మొదటిలెక్కకు నీలెక్కకుసు సుమా రేఁబదిసంవత్సరములు భేద మున్నను మొత్తముమీఁదఁ బ్రోలుగంటి రంగప్రధాని క్రీ. శ. 16-వ శతాబ్ద్యాది నున్నవాఁ డగును గనుక నతనికి ముందున్న హరిభట్టు 15-వ శతాబ్దియం దుత్తరభాగమున