పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 3-4

నారసింహపురాణము. ఆ - 4

241


గీ.

మీఁదిమూఁకుళ్లు దెఱచిన మెఱుఁగు లురక
[1]దొంగలించెడురత్నపంక్తులునుబోలెఁ
గఠినహేతుల నుపరిభాగములు [2]ద్రెవ్వి
కాఱెఁ గరికుంభమౌక్తికోత్కరము గరము.

51


క.

ముంగాలుగొరిసె లసిహతు, లం గెడపిన మ్రొగ్గె నురుబలము గలిగియు ను
త్తుంగతురంగశరీరము, లంగద వజ్రాభిహతనగాగ్రము లనఁగన్.

52


క.

ఘోరానిలవిఘటితరం, భారణ్యము వోలె సాయకాసారము చేఁ
దేరుగమి చిక్కుజీరై, వైరూప్యము నొంది తొంటివన్నియ దఱిగెన్.

53


గీ.

కదిసి కత్తుల కింతింతకండ లగుచు, నంటుకొని పోవు నుభయసైన్యముల భటుల
కాయ మీచాయదని పోరఁగానఁబడమి, నచ్చెరువు సేసె దివిఁ జూచునచ్చరలకు.

54


ఉ.

తాలతమాలనీలనసుధారజ మాకస మాక్రమించి పా
తాళము వేళ్లచేఁ బొదివి దట్టదనంబున బిట్టు పర్వఁ ద
న్మూలముఁ ద్రెంచె శాతశరముద్గరచక్రగదాత్రిశూలభి
న్నాలఘుయోధయూథవపురస్రపయోధివధూసహస్రముల్.

55


ఉ.

పోకుము పోకు మోరి యనఁ బో నిదె వచ్చితిరా యటంచు వై
రాకులచిత్తనృత్తి నుభయధ్వజినీభటకోటి వోర న
య్యాకస మెంత గల్గు నది యంతయు నిండెఁ గబంధమాలికల్
కోకిలవర్ణ మయ్యె నసికుంతరజఃపిహితాఖిలాండమున్.

56


ఉ.

వాహనహీనులయ్యు వసివాడక మిన్నులు చూడ కుద్భటో
త్సాహసమగ్రచిత్తముల దైర్యము శౌర్యము నావహిల్ల బా
హాహవదోహళత్వముగ నచ్చెరుపా టొనరించి రమ్మహా
వ్యూహయుగోగ్రవీరులు వయోబలపౌరుషగాఢమూర్తు లై.

57


క.

త్రాసునఁ దూఁచినకైవడి, వాసవసేనయును నసురవరుసేనయు న
త్రాసగతి హెచ్చుగుందులు, వాసిన సమరేఖ రణము పాటించుతఱిన్.

58


క.

కరిఁ గొలిపి కులిశధారలు, గరళంబుల నుమియ దివిజగణములతోడన్
హరిహయుఁడు చుట్టుకొనియెం, బరిపంథిబలంబు విజయపటహము లులియన్.

59


సీ.

కరవాలదండభీకరవేల్లనంబుల గళనాళములు బిట్టు నులిచి త్రెంచి
చక్రిచక్రోపమస్పర్శంబు లగుపాదహతులఁ గందనగాయ లట్లు రాచి

  1. దొంగ్గలింప్పెడు
  2. ద్రవ్వి