పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

242

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక

సంపుటము 13


శూలిశూలాగ్రనిష్ఠురదంతముఖములఁ బొడవుగా నందంద పొడిచి యెత్తి
యడ్డతాఁకుల నేనుఁ గైన హయం బైన రథ మైన మృదులచూర్ణముగ మెదిపి
తిరిగె నైరావణము మహాసురబలంబుఁ, జొరుగుఁ జేయుచుఁ గ్రొత్తనెత్తురులు మెదడుఁ
గండలును గొండలై నిండియుండ దివిజ, మండలాధీశుడెందంబు నిండ ముదము.

60


క.

తెరలిన నిజసైన్యంబుల, మరలిచికొని యసురభటసమాజము లొదివె
న్సురబలము నాసురోద్ధతి, ధరణీతల మదరఁ ద్రిదశధామము చెదరన్.

61


సీ.

సూచీముఖుండును శూర్పకర్ణుండును శంబరుండును సురేశ్వరునితోడఁ
గాలకేయుండును గాలదంష్ట్రుండును నక్రదంతుఁడు గంధవహునితోడఁ
గల్పకేతుండును గంకటాహ్వయుఁడును వామనుండును సమవర్తితోడ
వృశ్చికరోముండు వికటసత్త్వుండును గపిలాక్షుఁడును జలాధిపునితోడ
ఖరుఁడు బలియును గుహ్యకేశ్వరునితోడ, దీర్ఘజంఘద్విమూర్ధ్ను లాదితిజుతోడఁ
దవిలి ధూమ్రాక్షదూషణుల్ శివునితోడ, నఖిలరాక్షససైన్యంబు లగ్నితోడ.

62


వ.

ఘోరాకారంబులం బోరం దొడంగి రప్పు డాసూచీముఖశూర్పకర్ణశంబ
రులు శంబధరుం బొదివి పొది వివ్వక వెనుకదివ్వక వేసరక విసువక వెలియం
బాఱక విపాఠాసారంబు తోరంబుగ జోరనఁ గుడిసి తత్కరిశిరంబు శిలీ
ముఖవిద్ధంబు సేయుటయుఁ గ్రుద్ధంబై యాసిద్ధసింధురంబు శూర్శకర్ణుసువర్ణ
స్యందనంబు నమందవేగంబునం గడనొగలు నట్టి బిట్టు వీచి వైచుటయు
నన్నిశాచరుండు పిశాచబలప్రయత్నంబున రథాంతరసంపాదనలంపటుం డై
నిలింపులగుంపుల కుఱికి వేఱొక్కచక్కిఁ జిక్కుపఱుచుచుండె సూచీముఖుం
డేచినఁ బ్రాచీదిశీగీశ్వరుండు [1]భాస్కరకరధారాధాళధళ్యతస్కరంబు లగు
శరంబులు శరధరమాలికావిభూషణం బగు భీషణకార్ముకంబునం గీలు
కొలిపి కరి నంటఁగొలిపి యతం డేయుసాయకంబులు పాయం దట్టుచుఁ
బతాకావిదళనం బొనరించుటయు నమ్మదవదసురవిసరపతి సురపతికిం గాలా
యసనారాచంబున ఫాలతలంబునం గీలాలధార వొడమించి యార్చినం
బేర్చినకోపంబునం జాపం బెత్తి యాదేవోత్తముండు [2]చిత్తజల్లు పగిదిఁ గ్రొత్త
లగుపుత్తడిపింజియలతూపులు పింజపింజయుఁ గొనం బఱపుటయు నయ్యుర
వడికిం జాలక మెరపడి వీడనాడి యాసూదిముక్కురక్కసుం డూడనింబాడె
శంబరుం డంబరంబునం బన్ని శాంబరీసహస్రంబులం బొడమించుటయు

  1. భాస్కరకధారాధారధర్యతస్కర (భాస్కరకరధారాధౌరంధర్యతస్కర)
  2. చిత్తదళ్లు