పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

240

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక

సంపుటము 13


క.

వసురుద్రాదిత్యులు తీ, వ్రసమీరక్షుభితవిలయవారిధు లన ను
ల్లసితోగ్రవీరరసకే, లీసహితగతి వచ్చి రఖిలలేఖోన్నతులై.

43


క.

వీరాలాపంబులు ఘీం, కారంబులు హేషితములుఁ గలయ బెరయుటన్
ధీరంబు లయ్యెఁ దూర్య, స్ఫారారావములు త్రిదశబలములలోనన్.

44


క.

పొగలేనిమంట లొక్కట, బుగులుకొనియె నాయుధములఁ బున్నమరేలన్
జిగిదేఱు లేఁతవెన్నెల, మొగడలక్రియ నఖిలసుభటముఖరుచు లలరెన్.

45


క.

నలువదినాలుగుయోజన, ములవెడలుపు నిడుపుఁ గలిగి భువనభయద మై
వెలిఁగె న్శకటవ్యూహా, కలన మరుద్బలము కంఠగర్జలు చెలగన్.

46


వ.

అందు నవగ్రహంబులు దక్షిణచక్రంబును విశ్వేదేవతలు వామచక్రంబును
సిద్ధసాధ్యసమూహంబులు నొగలును నశేషమంత్రంబులును సమస్తాభిచారిక
క్రియాకలాపంబులును సకలయోగవిద్యారహస్యంబులును నాభిఫలకంబును
ధర్మం బిరుసుం గా నిర్మథితనిఖిలవిమతహృదయం బై యమ్మహావ్యూహం
బుత్సాహసాహసికత్వంబుల నొత్తరించె నత్తఱి నుత్తాలరోషానలజ్వాలాభీలం
బై ప్రహ్లాదవాహినియు సూచీముఖ శూర్పకర్ణ శంబర దీర్ఘజంఘ కాలకేయ
కాలదంష్ట్ర దంతవక్త్ర వృశ్చికరోమ ధూమ్రాక్ష కపిలాక్ష వామనప్రముఖాఖిల
శతమఖవిరోధియూథమేదురం బై దురంబునకు నంగవించె ని ట్లుభయసైన్యం
బులుఁ దారసించు నవరసంబున వాసవుం డాసురబలంబును నిజమాయా
బలంబునం జేసి ధూసరధరారజోవిసరప్రసరణం బగు సమీరణంబుఁ బుట్టించు
టయు నమ్మాయగాలి యుద్వేలం బై తధ్వరూధిని నొత్తరించుకొని యుత్తర
దిక్కునకుం బోవ నూకుటయు సోకోర్చి లోకత్రయగీతకీర్తి యగు దానవ
చక్రవర్తి శాంబరీచక్రిశతంబులఁ బుట్టించుటయు నాబుసకొట్టుందెట్టుపలు
బి ట్టలమి యక్కపటపవనంబు నపహరించె నప్పుడు.

47


క.

కలయంగ [1]బెరసె నిరువాఁ, గలఘుతరాయుధవిఘట్టనానలకణముల్
జలజల రాలఁగఁ గోలా, హలహాలాహలవిదారితాఖిలదిశమై.

48


గీ.

కరులుఁ గరులు హరులు హరులును రథులును,రథులు భటులు భటులు రణము సేయు
నుద్దవిడి సహింస [2]కూటాడ, బ్రహ్మాండమండలంబు తొంటిమట్టుఁ గడచె.

49


క.

తెగియెడుతలలును దెగి ధర, జిగినగవులతోడ రాలి చెన్నగు తలలున్
సగము తెగుతలలుఁ గలిగెం, బొగరున ననిసేయు రెండుమూఁకలయందున్.

50
  1. బెరశనిరువాదలఘుతర
  2. కూటాడె