పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒకానొక విశిష్టస్థానం సంపాదించింది. ఈ విశిష్టత ఆశ్వాసాంతాలలో గద్యంగా మాత్రమే పేర్కొనబడడంద్వారా మరింత దృఢపరచుకొన్నది.

ఛందశ్శాస్త్రవేత్త అయిన నరసింహకవి మామూలు యతిప్రాసలనే కాక కవులు అరుదుగా వాడే వృద్ధియతి, ఉభయవళులను, అభేదవళులను కూడా ప్రయోగించాడు.

"ఆజానుబాహు నీలాంబుదనిభదేహుఁ
గౌస్తుభాభరణు లోకైకశరణు."

{{right|(నార. 46. పు. 248. ప.) ఈసందర్భంలో లోకైకశబ్దంలో వృద్ధివళిక్రింద 'కై' లోని 'ఐ' కారానికి 'ఏక' లోని 'ఏ' కారానికి రెండచ్చులకూ యతి వేయవచ్చును. ఉభయవళి పేరుమీద అజ్ఝల్లులకు రెండింటికీ యతి వేయవచ్చును. కాగా నరసింహకవి "గౌస్తుభా" అన్నప్పుడు "గౌ" కారానికి 'లోకైక' అన్నప్పుడు 'కై' కారానికి స్వరమైత్రియుక్తాలైన హల్లులకు వర్గవృద్ధ్యుభయవళిగా యతిని ప్రయోగించాడు. ఈక్రిందిపద్యంలో చివరిపాదంలో 'రడ'ల అభేదమైత్రిని పాటించి విశిష్టమైన అఖండయతిని సైతం నరసింహకవి ప్రయోగించాడు.

"హరిభక్తిసమేతులఁగని
ధరలోపల శంఖచక్రధారణ ముసఖాం
తరముల నిందించినవాఁ
డరయఁగఁ బాషండు లండ్రు రాజన్యవరుల్.

(నార. 145 పు. 248. ప.)

నారదీయపురాణం 30 పు. 162 వ. పద్యమైన "సొగసుగా పింఛంబు" ఇత్యాది సీసపద్యంలో

"తళుకుబంగరుచీర గట్టించి గళమున
          నవరత్నహారముల్ వైచి వైచి"

అన్నమూడవపాదంలో "గట్టించి" అని ముద్రింపబడి యతి తప్పినది అని పుట్ నోట్ లో పేర్కొనడం జరిగింది. వాస్తవాని కిక్కడ నరసింహకవిచేత ప్రయుక్తమైనపదం గట్టించికాక, ధట్టించిగా కనిపిస్తున్నది. కాగా యతిదోషం లేదని గ్రహించాలి. ఇదేవిధంగా ఉపపాదంలో వైచి వైచి అని ప్రయోగించడంద్వారా యతిలోపం పేర్కొనబడింది. కాని నవచి నవచి అని కవిహృదయంగా ప్రయుక్తమైనట్లు కనిపిస్తున్నది.

నారదీయపురాణం 34. పుట 108. సీసపద్యంక్రింది తేటగీతి ప్రథమపాదం "హస్తములఁబట్టి బిరబిరఁ ద్రిప్పి యార్చి" అని ముద్రితమై యతిభంగం జరిగినట్లు