పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంస్కృతీయమైన అచ్చుకు సాధారణంగా సంధిని ప్రాచీనులు ఆమోదించలేదు. ప్రత్యేకించి సంస్కృతపదాలలో వున్న ఇత్వానికి సంధిని అసలే ఆమోదించలేదు. కాని నరసింహకవి "పొగడినవరాహమూర్తగు భగవంతుని" (నార. 85. పు. 488. ప.) అని మూర్తి + అగు అన్నప్పుడు సంధిచేసి "మూర్తగు" అని ప్రయోగించాడు. ఇది అగతికంగాచేసిన ప్రయోగంవలె కనిపిస్తున్నది.

నరసింహకవి నారదీయపురాణంలో వివిధ అలంకారాలను అనేకసందర్భాలలో ప్రయోగించాడు. అయితే రెండే రెండు సందర్భాలలో అత్యంతరమణీయమై, కమనీయమై హృదయానికి హత్తుకొనిపోయేవిధంగా అనుపమానమైన ఉపమాప్రయోగాలను నరసింహకవి చేశాడు. అత్యంతవిశిష్టంగా మనదృష్టి నాకర్షించే ఆ పద్యరత్నా లివి.

"అంబుజాక్షు నాత్మయందు నిల్పక యధ
మాధములఁ దలంచు టరయఁ దండ్రి
నాఁటి ధనము విడిచి నరుఁడు స్వప్నాగత
నిధి గృహంబునందు నిలిపికొనుట."

(నార. 179. పు. 159. ప.)

"ఏఁ దక్క నితరుల కెఱుఁగంగ రాకుండఁ
         జేసితినేనె విచిత్రమైన
మామకసంకల్పమహిమ తద్భక్తిమై
         మత్తత్త్వధీసుధామధురరసము
లసురులఁ గ్రోలింతు నతిరోగశిశువులఁ
         జక్కెర యనుచు నౌషధముఁ దల్లి
ద్రావించునట్లు తత్త్వజ్ఞాన ముదయింప
         బోధించునట్టి దుర్బోధమతుల"

(నార. 416. పు. 97. ప.)

ఛందోవిశేషాలు

నరసింహకవి సంస్కృతాంధ్రాలలో బహుముఖమైన పాండితీప్రతిభలు కలవాడు. మన ప్రాచీనకవులవలెనే నరసింహకవి కూడా ఉత్పలమాల, చంపకమాల, శార్దూల, మత్తేభాది సంస్కృతవృత్తాలను, కందం, సీసం , తేటగీతి, ఆటవెలది వంటి జాత్యుపజాతి పద్యాలనే కాక స్రగ్ధర, మహాస్రగ్ధర, లయగ్రాహి, కవి