పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నొకనికి నజ్ఞానంబున ధారవోసి యిచ్చితి. అన్యోన్యమత్సరంబుననున్న యాభూమీసురులలో నొకవిప్రుండు నన్నుఁ గృకలాసవం బగుమని శపియించె", (నార. 65. పు. 378. వ.) అని ఒకరు దానంగా యిచ్చినదాన్ని కాని, ఒకరికి దానంగా యిచ్చినదాన్నికాని మరొకరికి దానంగా యివ్వకూడదని పేర్కొన్నాడు.

ధర్మాధర్మాభిమానదేవతలు ఆత్మవృత్తిప్రకారం గురించి తెలియజేసేసందర్భంలో వివిధకాలక్రియాశబ్దవాక్యాది వ్యాకరణవిశేషాలను నరసింహకవి తెలియచేశాడు. (నార. 404, 405. పు.)

భాషాలంకారవిశేషాలు

నరసింహకవి అత్యంతవిశిష్టతగల యీ నారదీయపురాణకృతిలో అనేకజాతీయప్రయోగాలను, నానుడులను, సామెతలను యితర విశేష ప్రయోగాలను కొన్నిటిని ప్రయోగించాడు. కృష్ణుడు గోవర్ధనాన్ని యెత్తిన సందర్భంగా "ఉఫ్" అని తానూఁదనుండునే మింటిపైఁ బుష్కలావర్తకాంభోధరములు" (నార. 14. పు. 78. ప.) అని మనం మామూలుగా 'ఉఫ్‌' అని ఊదివేశాడు, అని వాడే 'ఉఫ్‌' పదాన్ని చక్కగా ప్రయోగించాడు. మామూలుగా పంచె కట్టుకొని పైపంచె వేసుకునేవారు ఆనందాతిరేకం కలిగినప్పుడు పైపంచె యెగరవేసుకుంటూ సంతోషంతో గంతులువేయడం జరుగుతుంది. యాదవాద్రిమీద శ్రీహరి దివ్యవిమానాన్ని సనత్కుమారుడు నిలిపినప్పుడు కల్యాణతీర్థంలోని ప్రజలు యెంతోసంతోషపడి పైపంచె లెగరవేస్తూ నర్తించారన్న విషయాన్ని నరసింహకవి యీక్రిందివిధంగా వెల్లడించాడు. "ఆ విచిత్రతఁ జూచి యౌర శ్రీ నారాయణాదిదేవుఁడు జగదద్భుతముగ నప్రమేయప్రమేయాకారముల రెంటఁ గనిపించె ననుచు వల్కలము లంత బొడవుగా నెగవైచి పొగడి నర్తింపుచు" (నార. 110. పు. 86. ప.) మామూలుగా 'కుక్కతోక పట్టి గోదావరి నీదడం', 'గోవుతోక పట్టి గోదావరి నీదడం' 'ఓటిపడవ నెక్కి ప్రయాణం చేయటం' వంటివి తెలుగులో నానుడులుగా వున్నాయి. నరసింహకవి కలియుగధర్మాలను వివరించే సందర్భంలో హరిభక్తి గొప్పదనం గురించి చెపుతూ హరిని మినహా యితరదేవతల నర్చించడం పగిలిన కుండ నాధారం చేసుకొని నది దాటాలని అనుకొనడం వంటిదని యీ క్రింది పద్యంలో చక్కగా వర్ణించాడు.

"హరిఁ దక్క నితరు నొక్కరు
శరణం బని తలఁచు టెల్ల సారతరంబై