పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కదా! కాగా మోక్షజ్ఞానానికి భిన్నమైనదంతా శిల్పంవంటిదని అనడంలో అవాస్తవికత యేమీ లేదు.

ధ్రువచరిత్రను అనేకగ్రంథాలలో విపులంగా వర్ణించడం జరిగింది కాని, ధ్రువుడు తపోధ్యాననిమగ్నుడై జపించిన మూలమంత్రాన్ని యే గ్రంథమూ ఉటంకించలేదు. ధ్రువుడు "హిరణ్యగర్భపురుషప్రధానావ్యక్తరూపిణే, ఓం నమో భగవతే వాసుదేవాయ శుద్దజ్ఞానస్వరూపిణే" (నార. 448. పు. 21. వ.) అన్న వేదమంత్రాన్ని జపించి సిద్ధి పొంది మహావిష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందగలిగాడని నరసింహకవి పేర్కొన్నాడు.

నరసింహకవి న్యాసమాహాత్మ్యాన్ని వర్ణిస్తూ ప్రస్తావనవశాత్తు కలియుగంలో త్రివిధతత్వపాషండులు, దొంగవైదికులు, దొంగయాజ్ఞికులు జన్మించి ప్రతిభావిరహితులై దుర్దేశికులుగా జీవిస్తారని వేదప్రమాణంతో పేర్కొన్నాడు. (చూడు. నార, 173. పు. 124. వ.)

వివాహాలలో మంగళసూత్రాలు కట్టడం, తలంబ్రాలు పోయడం యిటీవల నెలకొన్న సంప్రదాయం కాదని రుక్మిణీపరిణయసందర్భంగా నరసింహకవి వర్ణించిన పద్యాలలో "శుభకరంబైన మంగళసూత్ర మపుడు కట్టెఁ గృష్ణుండు రుక్మిణిగళమునందు".... "తలఁబ్రాలు వోసెఁ గృష్ణుండు కలకంఠీమణికి భీష్మకన్యకకు" (నార. 51. పు. 282, 283 ప.) అని నరసింహకవికాలానికి కూడా మంగళసూత్రాలూ, తలంబ్రాలు ప్రసిద్ధమై ఆచారంలోవున్నట్లు స్పష్టపరిచాడు.

సామాన్యంగా పరిపాలకులు యుద్ధాలు చేసి అనేకరాజ్యాల నాక్రమిస్తూ వుంటారు. ఇటువంటి సందర్భాలలో అనేకమంది ప్రజల పరిపాలకుల భూమి విజయం చేపట్టిన పరిపాలకునికి స్వాధీనమవుతుంది. వీటిల్లో యితర పరిపాలకులు దానంగా యిచ్చిన భూములుకూడా వుంటే వుండవచ్చును. విజయం చేపట్టిన పరిపాలకుడు తనకు లభించిన భూమిలో కొన్నిభాగాలను కొందరకు దానాలుగా యివ్వవచ్చును. ఇటువంటి సందర్భాలలో ఒకరు దానమిచ్చిన భూమినే తిరిగి మరొకరు దానంగా యివ్వడంకూడా జరుగుతుంది. అయితే ఒకసారి దాన మిచ్చినదానిని తిరిగి దాన మివ్వడం మహాదోషంగా మన ప్రాచీనులు భావించారు. కృష్ణునివలన కృకలాసవం శాపవిముక్తి పొందిన ఘట్టంలో తాను పూర్వజన్మలో రాజునని, ఒకరికి దానంగా యిచ్చిన ధేనువును మరొకరికి దానంగా యిచ్చి ధారవోసినందువల్ల తాను ఒకవిప్రుని ఆగ్రహానికి గురియై పరిశప్తుడ నయ్యానని చెపుతూ "ఏభవత్ప్రీతిగా జగతీసురుల గణేయంబులగు ధేనువుల దానం బొనర్చితి నందు నొకరికి నిచ్చిన ధేనువు