పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పురాణంవల్ల తెలుస్తున్నది. విష్ణుమూర్తి వామనావతారం దాల్చి, బలిని అణగద్రొక్కిన విషయం సుప్రసిద్ధమే కదా!

బలికి ప్రహ్లాదుడు వివిధధర్మవిశేషాలన్నీ చెపుతూ వుండేవాడు. విష్ణుమూర్తి వామనావతారం తాల్చి బలిని అణగత్రొక్కుతుంటే ప్రహ్లాదు డడ్డుపడి, "బలి హంతవ్యుడుకాడు. సద్ధర్మపరుడు నీతిపరుడు కాబట్టి అతనిని కాపాడవలసింది"గా విష్ణువును ప్రార్థించగా అప్పుడు విష్ణువు అతనిని సంహరించకుండా విడిచిపెట్టాడని కూడా వామనపురాణం పేర్కొంటున్నది.

అవతారాలు

వేదవాఙ్మయం ప్రకారం చూస్తే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించి అనేకానేకావతారా లున్నాయి. ఒక్క విష్ణువుకు సంబంధించి సుప్రసిద్ధమైనవి పది అవతారాలేయైనా వేదవాఙ్మయంలో మాత్రం విష్ణ్వవతారాలు అతీతదశదశాలుగానే కాదు, దశశతాలకంటే యెక్కువగానే వున్నాయి. సుప్రసిద్ధాలై యిప్పటి కవతరించిన తొమ్మిది అవతారాలలోనూ, వరాహ, నృసింహ, కృష్ణావతారాలు మాత్రమే, అన్యశక్తులవల్ల శ్రీ మహావిష్ణువులో అంతర్లీనమైనట్లు కనిపిస్తున్నవి. హిరణ్యాక్షసంహరణార్థం మహావిష్ణువు వరాహావతార మెత్తి హిరణ్యాక్షుని రక్తాని త్రాగి మదించి స్వైరవిహారం చేస్తూ లోకాలన్నింటినీ భయపెడుతూ, ఆ వరాహరూపంలోనే సంచరిస్తుండగా బ్రహ్మాది దేవతలందరూ భయపడి, మహేశ్వరునితో మొరపెట్టుకొన్నారు. అప్పుడు మహేశ్వరుడు శరభరూపం తాల్చి ఆ స్వైరవిహారం చేస్తున్న ఆదివరాహం బృహద్దంతాన్ని లాగివేసి దాని పీచమడగించినట్లు భాగవతస్కాందపురాణాలు పేర్కొంటున్నాయి. నారదీయపురాణంలో నరసింహావతారం ముగింపుగురించి ప్రత్యేకంగా యేమీ పేర్కొనలేదు. కాని శివపురాణ లింగపురాణాల ప్రకారం హిరణ్యకశిపుని సంహారానంతరం ఆ నరసింహుడు సగర్వంగా, విచ్చలవిడిగా తిరుగుతుంటే శివుడు శరభరూపం తాల్చి నరసింహావతారాన్ని ముగింపచేసి ఆ చర్మం తీసి తాను కప్పుకొన్నాడని తెలుస్తున్నది. అనంతరం ఆ నరసింహావతారంలోని నరరూపం నరుడుగాను, సింహరూపం నారాయణుడుగాను రూపొందినట్లు కూడా శివ-లింగ-పురాణాలు పేర్కొంటున్నవి. మహేశ్వరుడు గజచర్మధారిగా, అజనాషాడధరుడుగా, ప్రసిద్ధివున్నది కాని నరసింహచర్మధారుడుగా యే విధమైన ప్రసిద్ధీలేదు. యీ విషయంలో ఒక్క శివ లింగ పురాణాలవాక్కు తప్ప మరే యితరశాస్త్రాధారం కూడా కనిపించడం లేదు. పరశురాముడు రాముని చేతిలో వోడిపోయినా, సుదీర్ఘకాలం