పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లిద్దరూ తన అంశతో జనించినవారే అని వివరిస్తాడు, అని దేవీభాగవతంవల్ల తెలుస్తున్నది.

ప్రహ్లాదుని పుత్రుడైన విరోచనుడూ, సుధన్వుడనే బ్రాహ్మణుడూ ఒకకన్యాప్రతిగ్రహవిషయంలో వాదులాడుకుంటారు. అప్పుడు వారు తమయిద్దరిలో, గుణగణాలలో గొప్పవాడెవ్వరో నిర్ణయించి చెప్పవలసిందని యిద్దరూకూడా ప్రహ్లాదుని వద్దకే వెళ్తారు. అప్పుడు సుధన్వుడు నీవు ధర్మాధర్మాలను విచారించకుండా పక్షపాతంతో యేదైనా నిర్ణయానికి వచ్చేట్లయితే, నీ తల ముక్కలు చెక్కలవుతుందని అంటాడు. ఈ మాటలకు ప్రహ్లాదుడు భయపడి కశ్యపునివద్దకు వెళ్లి, విషయమంతా వివరిస్తాడు. అప్పుడు కశ్యపుడు "సాక్షీభూతుడైనవాడు, ధర్మదర్శుడు, విధి తప్పకూడదు. ఎవరైనా ధర్మం చెప్పవలసిందని వచ్చినప్పుడు, ధర్మం చెప్పకపోతే పాపం చుట్టుకుంటుంది. కాబట్టి ధర్మాధర్మాలను విచారించి ధర్మోద్ఘాటన చేయవలసిం" దని చెబుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు, విరోచన, సుధన్వుల గుణగణాలను విమర్శించి, సుధన్వుడే గుణవంతుడని మేటి అని, నిష్పక్షపాతంగా చెప్పినట్లు భారతం పేర్కొంటున్నది.

ప్రహ్లాదుని పుత్రుడైన విరోచనుడు, సుధన్వుడు ఒకసందర్భంలో పందెం వేసుకొని తమ తమ ప్రాణాలను పణంగా వొడ్డుతారు. అనంతరం తమ తగవు తీర్చవలసిందని వీరిద్దరూ ప్రహ్లాదునివద్దకు వెళ్తారు. విరోచనుడు తన పుత్రుడనికాని, సుధన్వు డన్యుడనికాని, తలంచకుండా సుధన్వునికి న్యాయం సమకూరుస్తూ, ధర్మబుద్ధితో తీర్పు చెప్పి తన తనయుని ప్రాణాలు పోగొట్టడాని కంగీకరిస్తాడు. అయితే తరువాత ప్రహ్లాదుడు ఆ సుధన్వుని వల్లనే తన తనయుని జీవితాన్ని దానంగా గ్రహించి విరోచనుణ్ని పునర్జీవితుణ్ని చేస్తాడని భారతంలో మరొకచోట పేర్కొనబడింది.

ప్రహ్లాదుని మనుమడు విరోచనుని పుత్రుడైన బలి రాజ్యంచేస్తూ వుంటాడు. "ఇప్పుడు దైత్యుల మహిమ, శక్తి, యుక్తులు, క్షీణించిపోతున్నాయి. ఇందుకు కారణం యేమి"టని ప్రహ్లాదుణ్ని బలి ప్రశ్నిస్తాడు. మహావిష్ణువు కారణంగానే దైత్యులశక్తి క్షీణిస్తున్నదని ప్రహ్లాదుడు చెపుతాడు. అప్పుడు బలి "ఆఁ! విష్ణుమూర్తి అంటే యెంత? అతణ్ని ఓడించగలిగిన వీరులు మనలో లేరా?" అని బలి విష్ణుధిక్కరణతో మాట్లాడుతాడు. అప్పుడు ప్రహ్లాదుడికి కోపం వచ్చి "నీవు విష్ణుమూర్తి వల్లనే అణగద్రొక్కబడతావు" అని బలిని శపిస్తాడు. అని వామన