పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వత్సరంబు పోరె. అతని నారాయణాస్త్రంబునం దూలించిన సమీరవేగంబులై విజితచంద్రప్రభాభోగంబులై యొక్కొక్కకర్ణంబు శ్యామంబై తృణతోయంబులు లేక బ్రతుకు తురంగాయుతంబును బుష్కరానుజయైన త్రిలోకసుందరి యగు నొకకన్యను భార్యార్థంబుగా సమర్పించె. (నార. 255, 256. పు. 318. ప. 319. వ.). ఈసందర్భాన్ని బట్టి ఆయామణులు యెంతటి మహత్తరశక్తివంతాలో మణిధారణాప్రభావంతో రుక్మాంగదు డేవిధంగా ప్రవృద్ధుడైన పునర్యౌవనవంతు డయ్యాడో స్పష్టపడుతుంది.

పూర్వజన్మలలో యెన్ని జన్మలలోనైనాసరే చేసిన యెంతటి ఘోరాతిఘోరాలైన పాపాలనైనా పోగొట్టి పవిత్రాత్ములుగా చేయగల శక్తి "పూర్వదుర్గతినాశినీ" మంత్రానికి వున్నదని మన మహర్షులు పేర్కొన్నారు. ఇదే విధంగా ప్రబోధనియైన కార్తీక శుక్లైకాదశినాడు యథావిధిగా ఉపవసించి విష్ణ్వర్చన చేస్తే యెంతటి బ్రహ్మహత్యాది పాపాలైనా నశించుతాయని నరసింహకవి రుక్మాంగదుని ద్వారా మోహినికి యీ క్రింది పద్యాలలో వివరించాడు.

"అక్లేశకరము కార్తిక
శుక్లైకాదశి యముండు చూడ వెఱచు రో
పక్లిన్నాక్షుండై హరి
విక్లబులను గావఁగాఁ దవిలి మేల్కనఁగన్.

బ్రహ్మహత్యాది దుస్తరపాతకములు
కామచారకృతంబులై కలిగిన యవి
యైన విలయంబు నొందు నన్యూనమహిమ
నిది ప్రబోధని యండ్రు యతీంద్రవరులు.

(నార. 270. పు. 28,29. ప.)

ప్రహ్లాదకథావైశిష్ట్యం

భాగవతాది యితరపురాణాలలో వున్న ప్రహ్లాదునికథకు, నారదీయపురాణంలో వున్న ప్రహ్లాదునికథకు మౌలికంగా కొంతభిన్నత్వం గోచర మవుతున్నది. శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులైన జయ, విజయు లిద్దరూ మునులవల్ల శాపగ్రస్థులై రాక్షసులుగా జన్మించిన విషయం సుప్రసిద్ధం. కృతయుగంలో జయ విజయులు హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా జన్మించి, బ్రహ్మకు, మహేశ్వరునకూ భక్తులై మహావిష్ణువుపట్ల త్రికరణశుద్దిగా విద్వేషభావాన్ని వహించినట్లు అనేకగ్రంథాలవల్ల మనకు ద్యోతక మవుతున్నది. అయితే నారదీయ