పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని ధర్మాంగదుడు అయిదుగురు విద్యాధరులను గెల్చి విభిన్నాలై మహత్తరశక్తివంతా లైన అయిదు మణులను తీసుకొనివచ్చి తండ్రి పాదాలముందు వుంచినట్లు నరసింహకవి యీ క్రింది విధంగా వర్ణించాడు. ఈ వర్ణనవల్లనే నాగశతావృతమైన భోగవతిని జయించి, అయుత నాగకన్యలను, ఫణిఫణారత్నాలను, యింకా యింకా అనేకానేక విజయఫలాలను తెచ్చి తండ్రికి సమర్పించినట్లు స్పష్టపడుతున్నది.

"అప్పన దెచ్చె విద్యాధరుల జయించి
        మణులేను నిజశక్తి మహిమ నొకటి
హాటకమయ లక్షకోటి ప్రదంబగు
        నొకటి సహస్ర శతోత్తమ పట
దాయకం బొక్కటి తారుణ్య సంపద్వి
        ధాయక నవసుధాధార లొలుకు
నొకటి గృహ ప్రధానోత్కట ధాన్య సా
        ధనమయి కీర్తిని దనరు నొకటి
వ్యోమగమనంబు నొందించు నొరపు మెఱయ
నట్టి మణి రాజములు దెచ్చి యధిక శౌర్య
ధనులు విద్యాధరాగ్రణుల్ దారు నశ్రు
పూర్ణ నేత్రాంతలై తదంభోజ ముఖులు.

వెంటరా ధర్మాంగదుండు రుక్మాంగద క్షితీశు పదంబులపై వ్రాలి వీరె యేవురు విద్యాధరులు మలయాచలంబున వీరి జయించితి వీక్షింపు మేతద్భార్యలు సైరంధ్రులయి యీ మణులచే మోహినీకాంత నలంకరింతురు. సర్వకామ ప్రదంబులై పునర్యౌవనదాయకంబులై యుండు నీ మణులు దాల్చిన జీర్ణవంతులేని లావణ్యవంతు లగుదురు. ఈ మణులు వళిపలిత నాశకంబులు. వస్త్ర హర్మ్య సువర్ణాది చింతితసిద్దిమూలంబులు. చింతామణులే కాని యితర మణులు గావు. గంధర్వులు నేనును ముప్పది దినంబులు రణం బొనర్చి నీ తేజంబున జయించి యప్పన గొంటి. ఏను సముద్రంబు ప్రవేశించి సముద్రగర్భంబున నొక యేఁడు వర్తించితి. నాగశతావృతమైన భోగవతి నిర్జించి యయుత నాగకన్యలం గొనివచ్చితి. ఫణిఫణా రత్నంబులు దెచ్చితి. నచ్చట దానవ మందిరంబున కేఁగి యెనిమిది వేవుర దానవీ కన్యకలనాహరించితి. శతకోటి రత్నంబులు దీపార్థంబుగా నాపాదించితి. యుష్మత్పరాక్రమపాలితుండ నై రసాతలస్థితంబగు వారుణ లోకంబు చొచ్చి వరుణుం గాంచి బ్రతుకవలసెద నేని తండ్రి యాజ్ఞం దిరుగు మనంగ నలిగి యుద్దసన్నద్ధుండై యొక