పుట:నాగార్జున కొండ.pdf/27

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శిల్పాలు

29


నాగార్జునకొండ శిల్పి మరి యితరచోట్ల శిల్పులు చూపిం చని విశిష్టమయిన పద్ధతిని బుద్ధ జీవిత దృశ్యాలనీ, జాతక కధలనీ విశాలమైన ప్రదేశంలో చిత్రించి దృశ్యానికి దృశ్యానికీ మధ్య కొద్దిపాటి జాగాలలో అత్యద్భుతములైన మిధునశిల్పాలని సృష్టించాడు అనేకమహాకవుల కావ్యములలో వర్ణించబడిన శృంగారభావాలకీ, నాయికానాయకుల చిత్తవృత్తులు మెరుగులు దిద్ది యీ శిల్పి వాటిని చలవరాతిలో ప్రతిబింబింపచేశాడు. ఇలాటి మిధున శిల్పాలు ఎన్నో వున్నవి. వాటిలో యీ క్రింది మూడు శిల్పాలూ ఎంతో హృద్యములుగా వున్నాయి.

(1) మధుపాత్ర సమర్పణం* : ఒక ప్రియుడు చిరకాలం ఎక్కడనో వుండి తన ప్రియురాలివద్దకి వచ్చి, పూర్వం వలెనే ఒక పాత్రలో మధువుపోసి ఆమెకి ఇస్తాడు. అతడు దగ్గర లేనప్పుడు మధుపానం చేసే అలవాటు తప్పిపోయినందున ఆమె ముఖం ఒక వైపుకి తిప్పుకుంటుంది.

(2) రాగోదయం : ఒక చిరకాలానంతరం ప్రియురాలివద్దకు వచ్చి వినోదభాషణాలతో కాలం వృథా చేస్తాడు. నాగినికి అంతలో రాగోదయం అవుతుంది. ఆమె తన చెవికి వున్న పద్మరాగాభరణాన్ని చూపించి తన రాగోదయాన్ని అత నికి సాంకేతికంగా సూచిస్తుంది.

(ఆ) నితంబాన్వేషణ" : ఒక ప్రియుడు కుపిత అయిన ప్రియురాలి దగ్గరకు చేరి ఆమెకి రాగోద్దీపన కలిగించే నిమిత్తం అంగస్పర్శచేస్తూ వీపు నిమిరి, నడుము తడమవలెనని సత