పుట:నాగార్జున కొండ.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

నాగార్జున కొండ

28

(3) యుద్ధము : ఇది రెండు పక్షాలవారికి జరిగింది. ఒక వైపు ఏనుగులు, గుర్రాలూ ఉన్నవి. రెండోవైపు సామాన్య ప్రజలు. ఇది వీరపురుషదత్తుడు ప్రజల తిరుగుబాటును అణచిన ఘట్టం.

(4) బౌద్ధస్వీకారం . ఇందులో ఒక వైపున రాజు శివ లింగాన్ని కాలితో తొక్కుతున్నాడు. రెండవవైపు అతడు బోధి సత్వుని కాళ్ళకింద కూర్చుని వున్నాడు. ఈ రాజున్నూ వీరపురుష దత్తుడే.

(5) దానాలు : ఒక స్తంభంమీద అయిదువరుసల శిల్పం ఉన్నది. అడుగువరుసలో బంగారపు ముద్దల రాశి ఉన్నది. దానిని రాజు ధారాపూర్వకంగా దానం చేస్తున్నాడు. పై వరు సలో రాజు ఏనుగుని ఎక్కి ఊరేగుతున్నాడు. ఇంకో శిల్పంలో రాజుముందు ఒక ఆవును నిలిపి అలంకరిస్తున్నారు. ఈరాజు మొదటి చాంతమూలుడు. ఈ దృశ్యాలు గోహిరణ్యదానాలనీ, అశ్వ మేధవాజ పేయయాగాలని సూచిస్తాయి.


వివిధ శిల్పాలు

వీటిలో అనేకము లున్నవి. అందులో బుద్ధపాదాలుగల పలక," చైత్యం బొమ్మగల పలకలూ, సింహాలు త్రిరత్న చిహ్నాలుగల అంచుదూలాలు," మాలాలంకారములుగల పలకలు, ఒక శకయోధుడి బొమ్మగల పలక, మిధున శిల్పాలూ ముఖ్యము లైనవి.