పుట:నాగార్జున కొండ.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శిల్పాలు

27


చేస్తూ వచ్చాడు. అప్పుడు అతనికి దీర్ఘాయువనే కొడుకు పుట్టాడు. కొన్నాళ్ళకి కాశీరాజు దీఘతిని ఆనవాలుపట్టి అతనినీ, భార్యనూ చంపించేశాడు. దిఘీతి తనకొడుకుకి “ద్వేషాన్ని ప్రేమతో జయించు" అని బోధించి మరీ పోయాడు. కొంతకాలానికి దీర్ఘా యువు కాశీరాజు కొలువులో చేరి, ఒకనాడు అతనిని చంపి పగ దీర్చుకోబోయాడు. ఇంతలో తండ్రి ఉపదేశం జ్ఞాపకానికి వచ్చి. తన వృత్తాంతం రాజుకి తెలియచేశాడు. కాశీరాజు ఇతనికి కోసల రాజ్యం ఇచ్చేశాడు .

చారిత్రక శిల్పాలు

నాగార్జునకొండవద్ద దొరికిన కొన్ని శిల్పాలు ఇక్ష్వాకు రాజుల చరిత్రకి సంబంధించిన కొన్ని ఘట్టాలని నిరూపిస్తాయి. వాటిలో ఈ క్రిందివి ముఖ్యములు : (1) చక్రవర్తి : ఈ పేరువి రెండు శిల్పాలు ఉన్నవి. వీనిలో మధ్యన రాజు ఉన్నాడు. చుట్టూ అతని లాంఛనములు అయిన రాణులూ, మంత్రులూ, సేనాపతీ, చక్రమూ, కంఠాభర ణమూ, ఏనుగూ, గుర్రములు మొదలైనవి ఉన్నవి. ఈ రాజు మొదటి ఇక్ష్వాకు చాంతమూలుడు.

(2) శైవధిక్కారము : ఇలాంటివి రెండు శిల్పాలు ఉన్నవి. వీటిలో ఒక రాజు కొందరు వ్యక్తుల యెదురుగా ఒక శివలింగాన్ని కింద పడదోసి, కుడికాలుతో తొక్కుతూ ఉన్నాడు. ఈ రాజు ఇక్ష్వాకులలో మొదటి వీరపురుషదత్తుడు.