పుట:నాగార్జున కొండ.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

నాగార్జున కొండ


చేశాడని విలపించింది. ఉగ్రుడై ముసలిరాజు కుమారుడిని ఒక కొండమీదనించి కిందికి తోయించాడు. ఒక నాగరాజు అతనిని రక్షించి అర్ధరాజ్యం ఇచ్చాడు. ఏడాదికూడా గడవకుండగానే మహాపద్ముడికి వైరాగ్యం కలిగి, హిమాలయాలకి పోయి ముని వృత్తి అవలంబించాడు. కొందరు రాజభటులు ఇతనిని ఆనవాలు పట్టి కాశీరాజుతో చెప్పారు. వెంటనే తండ్రి వచ్చి ఇంటికి రమ్మని కొడుకును బతిమాలాడు. మహాపద్ముడు రానన్నాడు. ఆమీదరాజు తనని మోసం చేసిన రాణిని చంపించాడు.

(6) ఘటజాతకం : ఈ జాతకంలో భాగవతంలోని కృష్ణుడి జనన వృత్తాంతం ఉంటుంది. కంసదేశానికి మహాకంసు డనే రాజు ఉండేవాడు. అతనికి కంస, ఉపకంస అని యిద్దరు కొడుకులూ, దేవగర్భ అనే కూతురూ ఉండేవారు. ఈమెకు పుట్టే కుమారుడు కంసవంశాన్ని నాశనం చేస్తాడని జోస్యం చెప్పారు. పెద్దలు. కంసుడు రాజయాక చెల్లెలిని ఒక యింటిలో ఖైదుచేశాడు. ఇంతలో ఉపసాగరుడనే రాజపుత్రుడు ఇక్కడికి వచ్చాడు. ఇతడూ దేవగర్భా ఒకరినొకరు ప్రేమించుకుని, నేవకులని వశపరచుకొని తరచుగా కలుసుకునేవారు. వీరికి చాలామంది పిల్లలు కలిగారు. అందులో ఎని మిదవవాడు కృష్ణుడు.

(7) దీఘీతికోసలజాతకం" : ఒకప్పుడు కోసల దేశానికి దీఘీతి అనేరాజు ఉండేవాడు. కాశీరాజు దండెత్తివచ్చి ఇతనివి తరిమివేశాడు. దీఘీతి భార్యతో కలిసి కాశీ రాజ్యపు సరిహద్దులో ఒక పల్లెలో ఒక కుమ్మరి యింట్లో తల దాచుకుని కాలక్షేపం